Site icon Prime9

High cholesterol: కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయకపోతే కష్టమే..

High cholesterol

High cholesterol

High cholesterol: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరుగుతున్నాయి. ఎక్కువగా కొలెస్ట్రాల్‌ శరీరంలో పేరుకుపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఒక్కోసారి హై కొలెస్ట్రాల్‌ లక్షణాలు బయటకు కనిపించకుండానే మనల్ని చంపేస్తుంటాయి. శరీరం బరువు, కొవ్వు ఆధారంగా కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ అంచనా వేయవచ్చు అనేది నిపుణుల మాట.

శరీరంలోని హార్మోన్లు, విటమిన్‌ డీ ఉత్పత్తికి, ఆహార జీర్ణక్రియలో సాయపడే రసాయనాలను ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్‌ చాలా అవసరం.

ముఖ్యంగా మన శరీరంలోని కాలేయం నుంచి కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది. మిగిలిన కొవ్వులు తీసుకునే ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి చేరుతాయి.

శరీరంలో ఎక్కువ మొత్తంలో కొలెస్ట్రాల్‌ పేరుకుపనోతే గుండె జబ్బులు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

మందులు కొలెస్ట్రాల్‌ను మెరుగు పర్చేందుకు సాయపడతాయి. కానీ, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

 

గుండెకు ఆరోగ్యం కోసం(High cholesterol)

ప్రధానంగా రెడ్‌ మీట్‌, ఫుల్‌ ఫ్యాట్‌ పాల ఉత్పత్తుల్లో ఎక్కువగా లభించే సంతృప్త కొవ్వులను తీసుకోవడం తగ్గించుకోవాలి.

ట్రాన్స్ ఫ్యాట్లను తొలగించుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ ఎక్కువగా లభించే ఆహారాలు తీసుకోవాలి.

ఆవు నెయ్యి, సాల్మన్ చేపలు, వాల్‌నట్‌లు, అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. కరిగే ఫైబర్‌ను పెంచుకోవాలి. ఇవి రక్తప్రవాహంలోకి కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది.

నిత్యం వ్యాయామం

వారంలో ఐదు రోజులు తప్పనిసరిగా వ్యాయామం చేసేలా చూసుకోవాలి. నిత్యం అర్ధ గంటకు తక్కువ కాకుండా శారీరక వ్యాయామాలు చేయడం అలవర్చుకోవడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

స్మోకింగ్‌ కు దూరంగా(High cholesterol)

సిగరెట్‌ స్మోకింగ్‌ కారణంగా చెడు కొలెస్ట్రాల్‌ విపరీతంగా పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు పెరుగుతాయి. అందుకని చెడు కొలెస్ట్రాల్‌ అందించే సిగరెట్‌ తాగడాన్ని మానుకోవడం ఉత్తమం

బరువు నియంత్రణలో

శరీరం అధిక బరువు లేదా ఊబకాయం చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

శరీరం బరువును తగ్గించుకోవడం ద్వారా 5-10 శాతం వరకు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించుకునే వీలు ఉంటుంది.

మితంగా ఆల్కహాల్‌

మద్యం తాగే అలవాటున్నవారు ఆల్కహాల్‌ తీసుకోవడాన్ని మితంగా చేసుకోవాలి. 65 ఏండ్ల పైబడిన వయసున్న వారు నిత్యం ఒక ఔన్స్‌ తీసుకోవడం వరకు ఇబ్బంది లేదు.

అయితే, మితిమీరిన ఆల్కహాల్‌ సేవిస్తే కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచడంలో దోహద పడుతుంది. అధిక ఆల్కహాల్‌ తాగే అలవాటు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

 

 

అధిక కొలెస్ట్రాల్‌ను గుర్తించొచ్చు

నిద్ర పోతున్న సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిర్లు వస్తాయి. రక్త ప్రవాహం వేగం తగ్గడం వలన చర్మం రంగును మారే అవకాశాలు ఉంటాయి.

కాళ్లకు తగినంత ఆక్సిజన్‌ అందక బరువుగా అనిపిస్తాయి.

పలు భాగాల్లో మంట, నొప్పిగా ఉంటుంది. అధిక మొత్తంలో కొలెస్ట్రాల్‌ ఉన్నవారిలో పాదాలు, కాళ్లు చల్లగా అనిపిస్తాయి.

మెడ, దవడ, కడుపు, వీపు భాగంలో నొప్పి కనిపిస్తే అది కొలెస్ట్రాల్‌ సమస్యగా భావించవచ్చు.

రక్తంలో కొవ్వు శాతం పెరిగినప్పుడు కళ్లపై పసుపు మచ్చలు కనిపిస్తాయి. విపరీతంగా చెమటలు కూడా పడతాయి.

 

Exit mobile version