Health Tips for Diabetes: ఘగర్ వ్యాధి గురించి తెలియన్ని వాళ్లు లేరు. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఈ మధుమేహ వ్యాధి వేధిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఒక్కసారి ఈ వ్యాధి వస్తే దీనికి జీవితాంతం మందులు వాడడం తప్ప పర్మినెంట్ సొల్యూషన్ అంటూ లేదు. దీనికి నివారణ కన్నా నియంత్రణే మేలు అంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే కొన్ని ఆహార జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణల సలహా. మరి శరీరంలో కలిగే మార్పుల వల్ల కూడా ఈ వ్యాధిని గుర్తించి తొలిదశలోనే అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
చక్కెర వ్యాధి ఒక్కటి చాలు మన శరీరంలో సర్వరోగాలు రావడానికి. మధుమేహం బారిన పడితే అది జీవత కాలం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఈ సమస్య తీవ్ర తరం కాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. శరీరంలో మధుమేహం తీవ్ర తరమైతే పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి.
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే అది టైప్ 1, టైప్ 2, ప్రీ డయాబెటిస్‌లకు దారి తీస్తుందని నిపుణులు చెప్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వీటిని ముందుగానే గమనించి.. వైద్యులను సంప్రదించడం వల్ల అనేక ప్రాణాంతక సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.
ఈ లక్షణాలు కనిపిస్తే జర జాగ్రత్త
- అరికాళ్లు, కాలి వేళ్ల మధ్య చర్మ సమస్యలు వచ్చాయంటే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగాయని గుర్తించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- పాదాల వాపు, తరచుగా నొప్పి ఉంటే.. జాగ్రత్త వహించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది కొన్నిసార్లు మధుమేహానికి సంకేతం కావచ్చని చెప్తున్నారు.
కాబట్టి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి… అశ్రద్ధ వహించకుండా ఏదైనా సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. ఆహారాన్ని తగిన మోతాదులో మాత్రమే శరీరానికి అందించండి.