Site icon Prime9

Health Tips : ఆ సమస్యలతో బాధ పడేవారు పసుపును తగ్గిస్తే మంచిదని తెలుసా ..!

health-tips-about-using-turmeric-and-side-effects

health-tips-about-using-turmeric-and-side-effects

Health Tips : పసుపు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం వంటకాలలో మాత్రమే కాకుండా పసుపుని ఔషధం గానూ వాడతాం. పసుపులో ఉండే కర్కుమిన్‌ కారణంగా దానికి ఆ రంగు, శక్తి వచ్చింది. అదే విధంగా పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ కార్సినోజెనిక్, యాంటీ మ్యూటాజెనిక్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిక్యాన్సర్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా పసుపుని ఔషదంలా ఉపయోగిస్తున్నారు.

ఎప్పటి నుంచో స్త్రీలు పసుపును ముఖానికి ఫేస్‌ప్యాక్స్‌ లాగా, ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ఉండేందుకు ఒళ్లంతా పసుపు రాసుకుని స్నానం చేయడం మనకు తెలిసిందే. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు పాలలో పసుపు వేసుకుని తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అయితే పసుపును ఎక్కువగా వాడడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా …

పిత్తాశయ సమస్యలు : ఈ సమస్యలతో ఇబ్బంది పడేవారు పసుపును తక్కువగా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. పసుపు లోని లక్షణాలు పిత్త స్రావాన్ని పెంచుతుంది. దీంతో పిత్తాశయ సమస్యలు ఉన్న వారు పసుపును తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

గ్యాస్ సమస్యలు : గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు పసుపు తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసుపు కారణంగా ఈ గ్యాస్ట్రో సమస్యలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు.

షుగర్‌ పేషెంట్స్‌ : షుగర్ కారణంగా మెడిసిన్‌ తీసుకుంటున్న పేషెంట్లు పసుపును తక్కువగా తీసుకోవాలి. పసుపులో ఉండే ఔషద గుణాలు రక్తం లోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీని కారణంగా ట్యాబ్లెట్లు తీసుకునే షుగర్‌ వ్యాధిగ్రస్తులు మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని అంటున్నారు.

Exit mobile version
Skip to toolbar