Health Tips : ప్రస్తుత కాలంలో మారుతున్న అహహరపు అలవాట్లు, తదితర కారణాల వల్ల ఎక్కువ మంది ఆధికా బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు జిమ్ లలో చెమటోడుస్తూ కష్టపడుతుంటారు. అందుకోసం ఆహారపు అలవాట్లను పూర్తిగా దూరం చేసుకుంటూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. అయితే ఆహారాన్ని కూడా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తేలిక గానే బరువు తగ్గేందుకు నిపుణులు పలు చిట్కాలను తెలుపుతున్నారు.
పాలు, పాల పదార్ధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పాలలో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే కొందరిలో పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ ఉంటుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా పాలు తాగుతూ కూడా శరీర బరువును తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీకోసం ప్రత్యేకంగా…
- సాధారణంగా పాలలో కొవ్వు ఉంటుందనే విషయం తెలిసిందే. దీనివల్లే శరీరం బరువు పెరుగుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్ లో ఫ్యాట్ తక్కువ ఉండే పాలు కూడా లభిస్తున్నాయి. వాటిని తాగడం వల్ల కూడా శరీర బరువును నియంత్రించవచ్చు.
- పాలలో తేనె కలుపుకొని రోజు తాగడం వల్ల బరువు పెరగకుండా ఉండొచ్చు.
- పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల కూడా శరీరం బరువు తగ్గుతుంది.
- ముఖ్యంగా వ్యాయామం చేసిన తర్వాత పాలు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- అదే విధంగా రాత్ర పూట పడుకునే ముందు పాలు తగ్గడం ఉత్తమం. దీని ద్వారా శరీరం బరువు అదుపులో ఉంటుందని నిపుణులు తెలిపారు.