Eating Fruits: రోజూ పండ్లను తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చాలా మంది రోజూ పండ్లను తినరు. సందర్భానుసారంగా పండ్లు తింటారు. నిజానికి మన శరీరంలో రెండు రకాల పోషకాలు ఉంటాయి. కొన్ని పోషకాలు ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయి. అయితే రెండోది నీటితో కరిగి బయటకు వెళ్ళిపోతాయి. ప్రతిరోజు నీటి ద్వారా శరీరం పోషకాలను కోల్పోవడం ద్వారా పోషకాల లోపం కనిపిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే రోజూ ఒక పండు తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతిరోజూ పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు(Eating Fruits)
ఫైబర్ పుష్కలం: రోజూ ఒక పండు తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, పైల్స్ వంటి వ్యాధులను ఈ పండ్లలోని ఫైబర్ నివారిస్తుంది.
రోజూ ఒక పండు తినడం వల్ల బరువు తగ్గుతారు. ఏదైనా పండు తినడం వల్ల విడుదలయ్యే ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలో నిల్వ చేయబడిన చెడు కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి.
శరీరానికి అవసరమైన విటమిన్ సి వంటి పోషకాలు రోజూ నీళ్లతో పాటు శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అలాగే కాల్షియం కూడా క్షీణిస్తుంది. కాబట్టి రోజూ ఒక పండు తినడం వల్ల శరీరంలో విటమిన్ లోపం తగ్గుతుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు శరీరానికి అనేక రకాలుగా తోడ్పడతాయి. పండ్ల నుండి లభించే పోషకాలు ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు వంటి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతాయి.
పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. కొల్లాజెన్‌ను పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు , చర్మం మెరుపును, నిగారింపును పెంచడానికి సహాయపడతాయి.
మరింకెందుకు ఆలస్యం ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ ని రోజూ ఒకటి తినండి చాలు. అందం ఆరోగ్యం మీ సొంతం అవుతాయి.