Bottle Guard: శరీరానికి కావాల్సిన శక్తి మనం తీసుకునే ఆహారం ద్వారా ఎక్కువగా అందుతుంది. అందులోనూ కూరలు ఆకుకూరలు పండ్లు అనేక రకాలను మనం రోజూ తీసుకుంటుంటాం. అలాంటి కూరగాయాల్లో ఒకటి సొరకాయ దీనినే కొందరు ఆనపుకాయ అని కూడా అంటారు. చిన్నలైనా పెద్దలైనా చాలా మంది ఈ సొరకాయను తినడానికి ఇష్టపడరు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉండడం వల్ల పెద్దగా రుచి అనిపించదు. కానీ, దీనితో రకరకాలు వంటకాలు తయారు చేసుకుని తింటుంటారు. సొరకాయను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో(Bottle Guard)
సొరకాయలో విటమిన్లు, తక్కువ కేలరీలు, ఫైబర్, పొటాషియం, మినరల్స్, ప్రొటీన్లు ఉంటాయి. అంతేకాదు.. ఇందులోని నీటిశాతం వల్ల అజీర్ణ సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. సొరకాయ రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడుతుంది. సొరకాయలో కాలరీలు, పీచుపదార్థాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇది చాలా మంచి ఆహారం. మధుమేహ రోగులు దీన్ని తీసుకోవడం ఎంతో ఉత్తమం. అంతేకాదు.. సొరకాయతో ఎముకలు దృఢంగా మారుతాయి. ఎందుకంటే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి మీ ఎముకలను బలోపేతం చేస్తాయి. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా సొరకాయ ఉత్తమమైన ఆహారం
సొరకాయలో ఆరోగ్యానికి అవసరమైన మంచి పోషకాలు ఉండటం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి అధిక రక్తపోటును నివారింస్తుంది తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి నుంచి కూడా సొరకాయ మీకు ఉపశమనం కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా, చాలా మంది ప్రజలు ప్రస్తుతం ఒత్తిడితో కూడిన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అధిక స్ట్రెస్ కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే సొరకాయ తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు.