Benefits of Watermelon: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సరైన పోషకాలు వుండేలా జాగ్రత్త పడటం అవసరం. పుచ్చకాయ లో A, C మరియు E విటమిన్లు వున్నాయి. దీనిని తీసుకోవడం వలన చర్మానికి అసరమైన పోషకాలు లభిస్తాయి.
1.పుచ్చకాయ తినడం వల్ల మీ చర్మానికి అన్ని రకాల అమినో యాసిడ్‌లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు లభిస్తాయి.
2. పుచ్చకాయ కంటి ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది
3. కడుపుతో ఉన్న మహిళలు పుచ్చకాయ తినడం వల్ల పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.కాల్షియం అధికంగా ఉండే పుచ్చకాయ తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాతం వంటి రోగాలు నయమవుతాయి.
4.పుచ్చకాయ మన శరీరంలోని రక్తంలో ఏర్పడే కొలస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. శరీరంలోని ఉష్ణోగ్రతలను కూడా బ్యాలెన్సు చేస్తుంది. శరీరాన్ని డీహైడ్రేషన్ బారి నుండి కాపాడటంలో ముఖ్యపాత్రను పోసిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది.
5. పుచ్చకాయ పురుషుల్లో హార్మోన్లని పెంచుతుంది. దీనిలో ఉండే లైకోఫిన్ అనే పదార్థం పురుషుల్లోని వీర్యకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
6. పుచ్చకాయ విత్తనాలలోఐరన్, మెగ్నీషియం, పొటాషియం, పాస్పరస్, సోడియం, మాంగనీస్, జింక్‌లతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమీనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి.