Haemoglobin: మన అనారోగ్యాలకు చాలా వరకు కారణమేంటంటే.. ప్రస్తుత లైఫ్ స్టయిల్, తీసుకునే ఆహార పదార్థాలు, ఒత్తిడి. ఇవన్నీ కలిసి అనారోగ్యాలకు పాలు చేయడమే కాకుండా అనేక రకాల వ్యాధులకు కారణం అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఎదుర్కోంటున్న అనారోగ్య సమస్యల్లో హిమోగ్లోబిన్ లోపం కూడా ఒకటి. ఎర్రరక్త కణాల్లో ఉండే ఒక ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఇది శరీర భాగాలను ఆక్సిజన్ ను చేర్చి… శరీర కణాల నుంచి కార్బన్ డైయాక్సైడ్ ను ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది.
మెడికల్ గణాంకాల ప్రకారం సాధారణంగా హిమోగ్లోబిన్ శాతం మగవారిలో 13.5 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు ఉండాలి. దీని కంటే తక్కువ ఉంటే రక్తహీనత, తొందరగా అలిసి పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, హార్మోన్ సమస్యలు, రోగ నిరోధక శక్తి తగ్గటం, జుట్టు రాలటం, చర్మం పాలిపోవటం, గర్భిణుల్లో గర్భస్రావం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ కారణంగా పురుషుల కంటే స్త్రీలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. దేశంలో సగానికిపైగా మహిళలు, పిల్లలు ఐరన్ లోపంతో బాధ పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో ఐరన్ లోపించినా, లివర్ సమస్యలున్నా, కొన్ని అంటు వ్యాధులు లాంటి సమస్యలు శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడానికి కారణమవుతాయి. కాబట్టి శరీరంలో హిమోగ్లోబిన్ ను తగ్గకుండా చూసుకునేందుకు బలమైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి.
బీట్‌రూట్ లో అధికంగా పోషకాలు ఉంటాయి. బీట్‌రూట్ లో అధికంగా ఐరన్ ను కలిగి ఉండటమే కాకుండా పీచుపదార్థం , పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో వుంటుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలను అభివృద్ధి, హిమోగ్లోబిన్‌ను పెంచే B1, B2, B6, B12, C విటమిన్లు పుష్కలంగా కలిగి వుంటుంది బీట్ రూట్
అత్యంత శక్తివంతమైన ప్రయోజనాలు ఉన్న ఆకుకూరల్లో పాలకూర ఎంతో ముఖ్యమైనది. పాలకూతో ‘సి’ విటమిన్ అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా క్యాన్సర్ నిరోధకాలైన కెరోటినాయిడ్స్ లాంటి యాంటాక్సిడెంట్స్‌ను పుష్కలంగా కలిగి వుంటుంది. పాలకూర కంటి సంబంధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
బీన్స్ , బఠానీ, చిక్ పీస్ , కాయధాన్యాలు, సోయా లాంటి చిక్కుళ్లలో ఐరన్, మెగ్నీషియం, పోటాషియం లు పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా వీటిలో కరిగే గుణం ఉన్న ఫైబర్స్ కూడా ఉన్నాయి. దీంతో జీర్ణవ్యవస్థను మెరుగుపర్చి జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేసి శరీరాన్ని ఎప్పుడూ తేలికగా ఉంచుతుంది.
రెడ్ మీట్ ని మన దేశంలో తక్కువగా వినియోగిస్తుంటారు. కానీ తెల్లటి మాంసం కంటే అధికంగా ప్రోటీన్లు, మైయోగ్లోబిన్ లు రెడ్ మీట్ లో ఎక్కువగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యానికి దోహదపడే ఐరన్, జింగ్, విటమిన్ బి, అధిక మోతాదులో ప్రోటీన్లను కలిగి వుంటుంది. ఇందులో ఇతర పోషకాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సెలీనియం, పలు రకాల విటమిన్లు, అత్యంత అరుదుగా లభించే హీమ్ ఐరన్ కూడా రెడ్ మీట్ లో ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వారికి, హిమోగ్లోబిన్ పెంచుకోవాలను వారికి రెడ్ మీట్ మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు.