Site icon Prime9

French Fries: ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే డ్రిపెషన్ కి వెళ్లే ప్రమాదం.. తాజా స్టడీలో వెల్లడి

French Fries

French Fries

French Fries: జంక్ ఫుడ్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడైనా రెస్టారెంట్ కు వెళ్లినా, మూవీకి వెళ్లినా మెనూ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉండాల్సిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. అయితే, అంత ఇష్టంగా లాగించే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ గురించి ఓ చేదు నిజం తెలిస్తే ఖచ్చితంగా అవాక్కవుతారు.

 

ఆందోళన రిస్క్ ఎక్కువగా(French Fries)

తరచూ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే అని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జంక్ ఫుడ్ అంటేనే అనారోగ్యం. అందులో ఈ ఫ్రైస్ లాంటి ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల డిప్రెషన్ , ఆందోళన కలిగే రిస్క్ ఎక్కువగా ఉందని తాజాగా వెలువడిన చైనీస్ పరిశోధన తేల్చింది. దీనిని అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆణ్ సైన్స్ జర్నల్ లో ప్రచురించింది. 1 లక్షా 40 వేల మందిపై ఈ పరిశోధన చేశారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్న వాళ్లు 12 శాతం అధికంగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉన్నట్టు ఈ స్టడీలో తేలింది. నిరాశ, నిస్ప‌ృహ లకు 7 శాతం అధికంగా లోనయ్యే ఆస్కారం ఉన్నట్టు వెల్లడించారు. వేయించిన పదార్థాలు తింటున్న వారు మానసిక ఆందోళకకు గురవుతున్నారా? లేదా ఆందోళనకు గురి అయిన వాళ్లు ఫ్రై చేసిన పదార్థాలకు అట్రాక్ట్ అవుతున్నారా అనేది తెలియలేదు.

 

యువకుల్లో ఎక్కువగా

డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, చెడు కొలెస్ట్రాల్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. దాదాపు 11 ఏళ్లకు పైగా సాగిన ఈ స్టడిలో మొదటి రెండేళ్లలో డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులను మినహాయించారు. మిగతా వారికి వేయించిన ఆహారాన్ని.. ప్రత్యేకంగా ఫ్రై చేసిన బంగాళాదుంపలను తినే 8 వేల మందిలో ఆందోళన, మరో 12 వేల మంది లో డిప్రెషన్ కేసులను సైంటింస్టులు గుర్తించారు. ఫ్రైంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ప్రమాదం మరో 2 శాతం పెరిగినట్టు పరిశోధనలో తేల్చారు. అది కూడా యువకుల్లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన, నిరాశతో బాధపడుతున్న వ్యక్తులు తమ మూడ్ మార్చుకునేందుకు తరచుగా ఫుడ్ వైపు మళ్లుతున్నారు. అయితే ఆహారం ఎంపికలు అతిగా తీసుకోవడం వల్ల మానసిక కల్లోలం, ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, డిప్రెషన్ లాంటి జీవక్రియ రుగ్మతలకు దారి తీస్తోంది.

ఆవిరిపై ఉడికించుకుంటే

బంగాళాదుంపలతో కాకుండా క్యారెట్, స్వీట్ పొటాటో తో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవాలనుకున్నప్పుడు.. వాటిని ఆయిల్ లో వేయించడం కాకుండా ఆవిరిపై ఉడికించుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలను స్వీట్ పొటాటో ఇస్తుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇది ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్లతో నిండిన ఆహారం. మెగ్నీహియం ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

 

Exit mobile version