Fermented rice: చద్దన్నం అనగానే చులకనగా చూసేవాళ్లు ఎందరో. కానీ దాని వల్ల వచ్చే ప్రయోజనాలు తెలిస్తే చద్దన్నమే కావాలంటారు. చద్దన్నం ఆరోగ్యానికి మంచిదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. కానీ ఈ మాట ఇపుడు అమెరికన్ న్యూట్రిషియన్స్ కూడా చెబుతున్నారు.
ఇటీవల అమెరికన్ న్యూట్రిషియన్ అసోసియేషన్ చద్దన్నంపై అధ్యయనం చేసి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.
ఈ అధ్యయం లో తేలింతి ఏంటంటే.. అన్నం పులిసిపోతే ఐరన్, పొటాషియమ్, కాల్షియం లాంటి సూక్ష్మ పోషకాల లెవల్స్ పెరుగుతాయని వెల్లడైంది.
రాత్రి వండిన అన్నంలో లభించే ఐరన్ కన్నా.. తెల్లవారేసరికి వచ్చే ఐరన్ ఎక్కువగా ఉంటుందని.. అదే విధంగా బీ6, బీ12 విటమిన్నలు కూడా ఎక్కువగా లభిస్తాయని తేలింది.
చద్దన్నం తింటే శరీరం తేలికగా ఉంటుంది. శరీరానికి కావాల్సినంత బ్యాక్టీరియా లభిస్తుంది.
బాడీ హీట్ ను తగ్గిస్తుంది. తరచూ చద్దన్నం తినడం వల్ల బీపీ అదుపులో ఉండి, ఆందోళన తగ్గుతుంది.
నీరసం లాంటి సమస్యలు తగ్గు ముఖం పడుతాయి. శరీరంలోని అలర్జీ కారకాలు, మలినాలు తొలిగిపోతాయి.
ఎదిగే పిల్లలకు కూడా చద్దన్న మంచి పౌష్టికాహారం. అదే విధంగా లావు తగ్గాలంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని రాత్రే చల్లలో నానబెట్టుకుని ఉదయాన్ని తినాలి.
అపుడు మంచి ఫలితం ఉంటుంది.
చద్దన్నం తినే అలవాటు దాదాపు వెయ్యేళ్ల క్రితమే ఉంది. రకరకాల పద్ధతుల్లో చద్దన్నం తయారు చేసుకుంటారు.
ఏ పద్ధతిలో తయారు చేసుకున్నా, చద్దన్నం మేలు కలిగించేదేనని ఆయుర్వేద నిపుణులు, ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు.
పేదల ఆహారం అనే అపోహతో గత కొంతకాలంగా మన దేశంలో చద్దన్నం తినడం వెనుకబడింది.
అయితే, సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వైద్యం లాంటి పురాతన పద్ధతులు మళ్లీ పుంజుకుంటున్న నేపథ్యంలో చద్దన్నానికి కూడా మంచి రోజులొచ్చాయి.
ప్రస్తుతం చాలా ఫైవ్‌స్టార్ హోటళ్లు కూడా చద్దన్నాన్ని వాళ్ల మెనూలో ప్రత్యేకంగా చేర్చాయి.
ఒడిశా లో చద్దన్నం రోజును జరుపుకుంటారు. ఒడిశాలో చద్దన్నం అంటే పొఖాలొ అని అర్ధం. మార్చి 20వ తేదీని ‘పొఖాళొ దివస్’ (చద్దన్నం దినోత్సవం) గా పాటిస్తున్నారు ఒడిశా వాసులు.
ముఖ్యంగా ఆరోజు నాటి నుంచి వేసవి కాలం అయ్యే వరకు చద్దన్నం తింటారు.
పూరీలో జగన్నాథుడికి ప్రతిరోజూ నైవేద్యంగా పెట్టే ‘ఛప్పన్న భోగాలు’ అంటే 56 పదార్థాలలో చద్దన్నం కూడా ఒకటి.
రాత్రి వండిన అన్నంలో నీళ్లుపోసి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సేపు నానబెడతారు.
మర్నాటి ఉదయానికి ఈ నీరు పులిసి, చద్దన్నానికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇలా పులిసిన నీటిని ‘తరవాణి’ అంటారు.
సాధారణంగా చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటారు. కొందరు ఏమీ కలుపుకోకుండానే, కాస్త ఉప్పు వేసుకుని ఉల్లిపాయ, మిరపకాయలు నంజుకుని తింటారు.
వెసులుబాటును బట్టి వేయించిన వడియాలు, అప్పడాలు, ఎండుచేపలు, ఆవకాయ వంటివి చద్దన్నంలోకి తింటారు.
కడుపు చల్లగా ఉండాలంటే వేసవిలో చద్దన్నం తిరుగులేని ఆహారం