Site icon Prime9

Hypertension: హైపర్‌టెన్షన్ నిర్వహణపై అవగాహన.. అతిపెద్ద గుండె ఆకారపు నిర్మాణానికి “ఆసియా బుక్ రికార్డ్”

Hypertension

Hypertension

Hypertension: ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, దేశంలో ప్రతినలుగురిలో ఒకరికి రక్తపోటు ఉంది. అయితే, వారిలో కేవలం 12% మందికి మాత్రమే వారి హైబీపీ నియంత్రణలో ఉంది. గ్రామీణ జనాభాలో రక్తపోటు ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఆరోగ్య సంరక్షణ అక్షరాస్యత లేకపోవడం, పేద రోగుల స్వీయ-సంరక్షణ లేకపోవడం, ఎక్కువ మంది సొంతంగా మందులను తీసుకోవడం, ఇంకా ఎన్నో కారణాలు ఈ రక్తపోటును తీవ్రతరం కావడానికి కారణాలని చెప్పవచ్చు.

కాగా డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ఈ రక్తపోటు నివారణ నియంత్రణపై అహగాహన కల్పించేందుకు నడుం బిగించింది. గ్రామీణ భారతదేశంలోని 30,813 మంది వైద్యులు వారి ప్రైమరీ హెల్త్‌కేర్ ప్రొవైడర్లతో కలిసి అధిక రక్తపోటు ఉన్న తమ రోగులకు సరైన చికిత్స విధానాలపై అవగాహన కల్పించింది. దీనికి సూచనగా దాదాపు 200 కిలోల బరువున్న “ఆకులను ఉపయోగించి రూపొందించిన అతిపెద్ద గుండె ఆకారపు నిర్మాణ ఇన్‌స్టాలేషన్ను హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని డాక్టర్ రెడ్డీస్ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. ఈ గుండె ఆకారం నిర్మాణంలో 30,813 మంది వైద్యుల సందేశాలు రాసిన అట్టముక్కలను జోడించి ఉంచారు. ప్రపంచ హైపర్‌టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మే 17న డాక్టర్ రెడ్డీస్ రూరల్ హెల్త్‌కేర్ టీమ్, ఇండియా హైపర్‌టెన్సివ్ కంట్రోల్ ఇనిషియేటివ్ (IHCI)ల మార్గనిర్దేశంలో సరైన హైపర్‌టెన్షన్ ట్రీట్‌మెంట్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తామని వైద్యులంతా ప్రతిజ్ఞ చేశారు.

హైపర్‌టెన్షన్ నిర్వహణపై అవగాహన కల్పించినందుకు వైద్యుల అనుభవాలు, సందేషాలతో కూడిన ఈ హార్ట్ షేప్ ఇన్ స్టాలేషన్ కు కొత్తగా ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ కొటేషన్‌ను అందుకున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ప్రకటించింది. డాక్టర్ రెడ్డీస్ క్లస్టర్ హెడ్ (వాణిజ్య కార్యకలాపాలు) ఆదిత్య వశిష్టకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ న్యాయనిర్ణేత రామ్ మోహన్ రెడ్డి ఈ సర్టిఫికెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంత మంది డాక్టర్లు పాల్గొన్నారో ఆ వైద్యులందరూ డాక్టర్ రెడ్డీస్ నుంచి ‘ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రమాణ పత్రాన్ని అందుకున్నారు.

Exit mobile version