Site icon Prime9

Dandruff in Summer: చుండ్రు సమస్య వేధిస్తుందా? అయితే చిట్కాలను ట్రై చేయండి

Dandruff in Summer

Dandruff in Summer

Dandruff in Summer: ఎండాకాలంలో చాలామందికి చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది. తలలో ఎక్కువ చెమట పట్టడం.. కాలుష్యం లాంటి వాటితో తలలో త్వరగా మురికి చేరుతుంది. దీంతో ఎక్కువగా తలస్నానం చేస్తుంటారు. దీని వల్ల కూడా చుండ్రు పెరిగే ఛాన్స్ ఉంది. అలాంటప్పుడు చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లోనే కొన్ని చిట్కాలున్నాయి.

చుండ్రుకు కారణాలు(Dandruff in Summer)

చుండ్రు రావడానికి మెయిన్ మానసిక ఒత్తిడి, నిద్రలేమి కారణం. అయితే ఎండాకాలంలో చెమట వల్ల ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, ఈస్ట్‌ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
షాంపూను ఎక్కువగా వాడటం వల్ల కూడా మాడు త్వరగా పొడి బారుతుంది. దీనివల్ల చుండ్రు సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. కొందరికి జట్టును గట్టిగా బిగించి కట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అలా జుట్టును బిగుతుగా అల్లుకోవడం వల్ల కూడా గాలి తగలక చుండ్రు సమస్య తీవ్రమవుతుంది. ఎండలో ఎక్కువ గాతిరగడం వల్ల జుట్టు డ్రై అవుతుంది. అందువల్ల తల మీద ఎండ ఎక్కువగా పడకుండా కవర్‌ చేసుకోవాలి. చెమట వల్ల చికాకుగా ఉండి ఎక్కువసార్లు తలస్నానం చేస్తుంటాం. దీనివల్ల కూడా చర్మం పొడిబారి చుండ్రు సమస్య వస్తుంది. వీలైనంత వరకు తలస్నానం తగ్గించాలి.

ఇంట్లో దొరికే వాటితోనే(Dandruff in Summer)

చుండ్రు ఎక్కువగా ఉన్నపుడు వేప నూనె లేదా వేప ఆకులను గుజ్జుగా చేసి తలకు పట్టించాలి. గంట తరువాత తలస్నానం చేయాలి. దీనివల్ల చుండ్రు సమస్యే కాదు, దురద కూడా తగ్గుతుంది. నాలుగు స్పూన్ల గోరువెచ్చని కొబ్బరి నూనెలో అరచెంచా నిమ్మరసం కలపి..తలకు పట్టించి గంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. పెరుగు కూడా చుండ్రుకు బాగానే పని చేస్తుంది. కప్పు పెరుగును తలంతా పట్టించి అరగంట ఆగి తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా మేలు జరుగుతుంది. కలబంద గుజ్జును తలకు పెట్టుకున్నా ఫలితం ఉంటుంది. పావు కప్పు యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను పావు కప్పు నీళ్లలో కలిపి.. ఈ మిశ్రమాన్ని జుట్టు తడిగా ఉన్నపుడు మాడుకు పట్టించాలి. అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయొచ్చు.

 

ఇవి పాటిస్తే..

వారంలో మూడుసార్లు తలస్నానం చేసేలా చూసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో మాడు నుంచి నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల దుమ్ము, దూళి చేరి చుండ్రు ఎక్కువ అవుతుంది. చుండ్రు వల్ల దురద ఎక్కువగా ఉంటుంది. దాంతో తరచూ తలలో చేయి పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్‌ ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది. దీంతో సమస్య ఇంకాస్త పెరుగుతుంది. హెయిర్‌ స్టైలింగ్‌ కోసం క్రీములు, స్ప్రేలు ఎండాకాలంలో ఎక్కువగా వాడితే అవి మాడును పొడిబారేలా చేసి చుండ్రును పెంచుతాయి. వారానికి ఒకసారైనా ఏదైనా ఆయిల్‌తో కుదుళ్లకు బాగా మర్దనా చేసుకోవాలి. దీనివల్ల రక్త సరఫరా మంచిగా జరుగుతుంది. మాడులో ఉండే చర్మ కణాల పనితీరు కూడా మెరుగుపడి చుండ్రు సమస్య తగ్గుతుంది.

 

Exit mobile version