Site icon Prime9

Calorie Fruits: క్యాలరీలు తక్కువగా ఉండే పండ్లు ఏంటో తెలుసా?

calorie fruits

calorie fruits

Calorie Fruits: చాలామంది ఆకలి వేసినపుడు.. కనపడిన స్నాక్స్ తింటుంటారు. మరీ ముఖ్యంగా ప్రాసెసింగ్ చేసిన ఆహారం లాంటివి ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే, క్యాలరీలు అధిక స్థాయిలో ఉంటాయి. మళ్లీ క్యాలరీలను ఎలా తగ్గించుకోవాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం క్యాలరీ లెక్కలు లేకుండా తాజా పండ్లను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కొన్ని పండ్లలో క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మరి అలాంటి పండ్లు ఏంటో చూద్దాం.

 

క్యాలరీలు భయం లేకుండా..(Calorie Fruits)

100 గ్రాముల యాపిల్‌ తీసుకోవడం వల్ల కేవలం 57 క్యాలరీలు మాత్రమే అందుతాయి. అంతే కాకుండా యాపిల్ లో మూడు గ్రాముల ఫైబర్‌ కూడా ఉంటుంది. అందువల్ల యాపిల్‌ తినటం వల్ల కేలరీలు పెరిగి పోతాయనే ఇబ్బందులేమి ఉండవు.

మీడియం సైజులో ఉన్న ఒక టమోటా తింటే 22 క్యాలరీలు వస్తాయి. దీనిలో ఎక్కువ నీరు ఉండటంతో తక్కువ క్యాలరీలు ఉంటాయి.

150 గ్రాముల స్ట్రాబెర్రీలు తీసుకోవడం వల్ల కేవలం 50 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. స్ట్రాబెర్రీల్లో సి విటమిన్‌ కూడా ఎక్కువే ఉంటుంది.

140 గ్రాముల బొప్పాయి తింటే 44 క్యాలరీలు అందుతాయి. బొప్పాయిని క్రమం తప్పకుండా తింటే జీర్ణశక్తి కూడా బాగుంటుంది.

150 గ్రాముల పుచ్చకాయను ఆహారంగా తీసుకుంటే 56 క్యాలరీలు అందుతాయి. దీనిలో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది.

ఖర్బుజా సగం ముక్క తీసుకుంటే కేవలం 5 గ్రాముల చక్కెర, 23 క్యాలరీలు మాత్రమే ఉంటాయి.

ఒక మీడియం సైజు జామకాయలో 5 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఎక్కువ ఫైబర్ కావాలనుకుంటే జామకాయను తొక్కతో పాటు తినేయాలి.

స్మూతీతీలు, షేక్స్ కోసం జామకాయలను యాడ్ చేసుకోవచ్చు.

ఒక అవోకాడోలో 1.33 గ్రాముల చక్కెర మాత్రమే ఉంటుంది. అవోకాడో ను సలాడ్‌లో ఉపయోగించుకోవచ్చు. బ్రెడ్ టోస్ట్‌ తో జత చేసుకుని తినచ్చు.

స్మూతీలో ఉపయోగించవచ్చు. కానీ అవోకాడో కేలరీలు ఎక్కువగా ఉన్నా.. చక్కెర స్థాయిలు తక్కువగా ఉంటాయి.

 

Exit mobile version