Site icon Prime9

What Is HMPV Virus: మాస్క్ ఈజ్ బ్యాక్.. ఇండియాని వణికిస్తున్న చైనా వైరస్.. ఈ సింపుల్ టిప్స్‌తో కట్టడి చేయండి..!

HMPV

HMPV

What Is HMPV Virus: హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) కేసులు చైనాలో వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఇతర దేశాలతో పాటు భారతదేశంలో కూడా హెచ్ఎమ్‌పివి బారిన పడటం వలన ఆరోగ్య సమస్యలు పెరిగాయి. హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్  మొదటి కేసు భారతదేశంలోని బెంగళూరులో నమోదైంది. కేవలం 8 నెలల బాలికకు హెచ్ఎమ్‌పివి వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇంతలో ఢిల్లీ ఆరోగ్య అధికారులు హెచ్ఎమ్‌పివి, ఇతర శ్వాసకోశ వైరస్‌లను నివారించాలని ప్రజలకు సలహా ఇచ్చారు. హెచ్ఎమ్‌పివి గురించి వివరంగా తెలుసుకుందాం.

హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ అంటే ఏమిటి?
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) అనేది ఒక వైరస్, దీని లక్షణాలు సాధారణ జలుబును పోలి ఉంటాయి. సాధారణ సందర్భాల్లో, ఇది దగ్గు లేదా గొంతు నొప్పి, ముక్కు కారటం లేదా గొంతు నొప్పికి కారణమవుతుంది. HMPV ఇన్ఫెక్షణ్ చిన్నపిల్లలు, వృద్ధులలో తీవ్రంగా ఉంటుంది. ఈ వైరస్ బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులలో తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది.

ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ (SARI) కేసులను తక్షణమే నివేదించాలని ఆసుపత్రుల ప్రభుత్వం సూచించింది.  అనుమానిత కేసుల కోసం కఠినమైన ఐసోలేషన్ ప్రోటోకాల్‌లు, సార్వత్రిక జాగ్రత్తలు,  ధృవీకరించిన ఇన్ఫ్లుఎంజా కేసుల డాక్యుమెంటేషన్ నిర్వహించడం చాలా అవసరమని వెల్లడించింది.

చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) వ్యాప్తి చెందుతున్నట్లు నివేదికలు ఉన్నాయి. కానీ భారతదేశంలో శ్వాసకోశ వ్యాప్తి డేటా విశ్లేషించారు. డిసెంబర్ 2024 గణాంకాల్లో గణనీయమైన పెరుగుదల లేదు. దేశంలోని ఏ ఆరోగ్య సంస్థ నుండి కూడా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వలేదు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) నివారణ
1. ఎవరికైనా దగ్గు మరియు జలుబు ఉంటే, ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండటానికి వారితో సంప్రదించకుండా ఉండాలి.
2. మీకు జ్వరం, దగ్గు లేదా తుమ్ముతున్నప్పుడు మీ నోరు, ముక్కును కప్పుకోండి, బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండండి.
3. ఇది కాకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలని సూచించారు.

Exit mobile version
Skip to toolbar