Site icon Prime9

Drumsticks Health Benefits: మునగతో ఆరోగ్యానికి మేలు..

drumsticks health benefits

drumsticks health benefits

Drumsticks Health Benefits: మునక్కాయ ఆ టేస్టే వేరు సార్. ఇటు సాంబార్‌ వండినా అటు మునక్కాయ టమాటా వండినా మరి ఇతర రకాలైన మునక్కాయ కూరలు వండినా లొట్టలేసుకుంటూ తినేవారు లేకపోలేరు. కొన్ని సార్లు సాంబార్‌లో ఉండే మునక్కాయ కోసం ఇంట్లో చిన్నపాటి యుద్ధాలు జరుగుతుంటాయనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. మునక్కాయ అంత టేస్ట్ గా ఉంటుంది మరి. మునక్కాయ టేస్టే కాదు.. పోషకాలు అద్భుతంగా ఉంటాయి. మునక్కాయలో విటమిన్‌ A, B1, B2, B3, B5, B6, B9, C, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలో డైటరీ ఫైబర్‌ కూడా అధికంగా ఉంటుంది. మునక్కాయలో యాంటీబ్యాక్టీరియల్,‌ యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. మునక్కాయ మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణలు చెబుతున్నారు.

మునక్కాయలో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. వృద్ధులు వారి డైట్‌లో మునక్కాయ చేర్చుకుంటే.. ఎముకల సాంద్రత పునరుద్ధరిస్తుంది, ఆస్టియోపోరోసిస్‌ లక్షణాలను తగ్గిస్తుంది. మునగలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తాయి.

మునక్కాయలో విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లూ, అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. మునక్కాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను తగ్గిస్తాయి. మునక్కాయ మీ డైట్‌లో చేర్చుకుంటే.. రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.

గట్‌ హెల్త్‌

మునక్కాయలోని థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్‌, విటమిన్ B12, B వంటి పోషకాలు జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయాడనికి సహాయపడతాయి. మునక్కాయలోని డైటరీ ఫైబర్‌ పేగు కదలికలను సులభం చేసి.. గట్‌ హెల్త్‌కు మేలు చేస్తుంది.​

కిడ్నీలో రాళ్లకు చెక్

మునక్కాయ తరచుగా తింటే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు కిడ్నీల నుంచి టాక్సిన్స్‌ను క్లియర్‌ చేస్తాయి. కిడ్నీలపై ఒత్తిడి తగ్గించి, వాటి పనితీరు మెరుగుపరుస్తాయి.

హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తుంది

మునక్కాయలోని నియాజిమినిన్‌, ఐసోథియోసైనేట్ వంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ ధమనులు గట్టిపడటాన్ని నివారిస్తాయి. హైపర్‌టెన్షన్‌ను నియంత్రిస్తాయి.

క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది

మునక్కాయలోని విటమిన్లు ఎ, సి, బీటా కెరోటిన్, నియాజిమిసిన్ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తాయి. అదనంగా, దీనిలోని రిచ్ యాంటీఆక్సిడెంట్ ప్రొఫైల్ ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కణాల ఆక్సికరణ నష్టాన్ని కూడా నివారిస్తుంది.

కంటి సమస్యలు దరిచేరవు

మునగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటిశుక్లం, కళ్లు పొడిబారడం వంటి సమస్యలకు చికిత్స చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కంటి సమస్యలు త్వరగా రాకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar