Site icon Prime9

Sesame Seeds: ఆరోగ్యానికి, రుచికి ఆహారంలో నువ్వులు ఉండాలి.

Sesame Seeds: మనదేశంలో సాగుచేసే పంటల్లో నువ్వులు ఒకటి. ఈ నువ్వులు మన ఆహారంలో తీసుకుంటే అటు రుచికరంగా ఉండటమే కాకుండా ఇటు ఆరోగ్యాన్ని కూడ కాపాడుకోవచ్చు. నువ్వులు సాధారణంగా తెలుపు మరియు నలుపురంగులో వుంటాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఒమేగా ఆమ్లాలు వుంటాయి.

యుక్తవయసులో వున్న ఆడపిల్లలకు పెట్టే ఆహారంలో నువ్వులు తప్పనిసరిగా ఉంటాయి. నువ్వుల, బెల్లం దంచి చిమ్మిలి చేసి పెట్టడం వలన హెమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడుతాయి. ప్రతిరోజు బెల్లంతో కలిపిన నువ్వుల ఉండలు తీసుకుంటే శారీరకంగా ధృడంగా వుంటారు. నువ్వులు తీసుకుంటే ఎదిగే పిల్లల శరీరంలో ఎముల ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే స్పూన్ నువ్వలను నోట్లో వేసుకుని నమిలితింటే ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. నువ్వులను తీసుకునే వారిలో జుట్టు పెరుగుదల వేగంగానూ, మరియు వొత్తుగానూ ఉంటుంది. నువ్వులనుండి తీసిన స్వచ్చమైన గానుగ నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు చెక్ పెట్టవచ్చు.

నువ్వులనూనెను ప్రతిరోజు శరీరానికి మర్దన చేసుకుని కొన్ని నిమషాలు ఎండలో వుండి తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చర్మవ్యాధులను నివారించవచ్చు. నువ్వులను దోరగా వేయించుకుని పొడి చేసి అన్నంలో కలుపుకుని తినవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కూరల్లో వాడుకోవచ్చు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడ మంచిది. నువ్వులలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్ ను నియంత్రణలో ఉంచుతాయి. ఇన్ని ప్రయోజనాలువున్న నువ్వులను ప్రణాళికాబద్దంగా వాడుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Exit mobile version