Chicken: నాన్ వెజ్ పేరు వినగానే మనకి బాగా గుర్తు వచ్చేది చికెన్, బిర్యాని. ఈ రోజుల్లో చాలా మంది మాంసం బాగా తింటున్నారు. దీన్ని హేట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉంటారు. అందులోనూ సెలవు దొరికితే చాలు చికెన్ చేసుకొని తినేస్తూ ఉంటారు. మనలో కొంత మందికి చికెన్ స్కిన్‌తో తినేస్తారు. ఇంకొందరు ఐతే చికెన్ స్కిన్‌లెస్ తింటారు. మీరు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 100 గ్రాముల చికెన్ స్కిన్‌లో 32 శాతం వరకు కొవ్వు ఉందని పోషక ఆహార నిపుణులు పరిశోధనలు చేసి కొన్ని విషయాలను వెల్లడించారు. చికెన్ స్కిన్‌లో ఐతే మంచి కొవ్వు మనకి దొరుకుతుందని,ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి మెరుగుపరుస్తుందని వెల్లడించారు.
ఇంకా చెప్పాలంటే వీటిలో మూడో వంతు మాత్రమే చెడు కొవ్వు ఉంటుందని ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి బాగా పెరిగేలా చేస్తాయని మీరు ఒక వేళ చికెన్‌ను స్కిన్‌తో ఆహారంలో ఎక్కువ తీసుకుంటే దానిలో 50 శాతం కెలరీలను పెంచుతున్నారని నిపుణులు వెల్లడించారు. 170 గ్రాముల స్కిన్‌లెస్ చికెన్‌ను మీరు ఆహారంలో కలిపి తీసుకుంటే 284 కెలరీలు వచ్చి మన శరీంలోకి చేరుతాయని న్యూట్రీషియన్ నిపుణులు వెల్లడించారు. మీరు తినే కేలరిల్లో 80 శాతం ప్రొటీన్ల నుంచి 20 శాతం కొవ్వు తయారవుతుందని, చికెన్ స్కిన్‌తో కలిపి తింటే మీ శరీరంలో 386 కెలరీలు చేరుతాయని. దీనిలో 50 శతం కెలరీలు ప్రొటీన్ల నుంచి, 50 శాతం కొవ్వు తయారవుతుందని వెల్లడించారు.
కాబట్టి చికెన్ ఎక్కువ తినే వారు కొంచం తగ్గించుకుంటే మీ ఆరోగ్యం బాగుటుంది. మరి ఎక్కువ తినేస్తే మీకు తెలియకుండానే లావు అవుతారు. మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. చికెన్ ఎక్కువ తినకండి మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోండి.