Site icon Prime9

Bombay Chutney: టిఫిన్ ఏదైనా కానీ బొంబాయి చట్నీతో తింటే ఆ టేస్టే వేరు..

Bombay Chutney: ఇప్పుడు పట్టణాల్లో బొంబాయి చట్నీ కనిపించడం లేదు కానీ పల్లెల్లో ఇప్పటికీ ఇది కనిపిస్తూనే ఉంటుంది. ఇది చేయడం చాలా సులువు అందుకే అక్కడ దీనిని రోజూ తయారు చేస్తారు. శనగపిండితో చేసే పచ్చడి కావడంతో దీనినిశెనగపిండి చట్నీ అని కూడా పిలుస్తారు. ఇడ్లీ, పూరీ, దోశ,చపాతీలో ఈ చట్నీని కలిపి తింటే ఆ రుచే వేరుగా వుంటుంది. ఇంతకీ బొంబాయి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

బొంబాయి చ‌ట్నీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ పిండి – 3 టేబుల్ స్పూన్స్, స‌న్న‌గా పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (పెద్ద‌ది), చిన్న‌గా త‌రిగిన ట‌మాట -1, త‌రిగిన ప‌చ్చి మిర్చి – 5 , క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఆవాలు – పావు టీ స్పూన్, జీల‌కర్ర – పావు టీ స్పూన్, మిన‌ప ప‌ప్పు – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – అర టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – రుచికి త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన కొత్తిమీర

ముందుగా ఒక‌గిన్నెలో శ‌న‌గ పిండిని, నీళ్ల‌ను పోసి ఉండ‌లు లేకుండా బాగా క‌లుపుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగిన త‌రువాత జీల‌క‌ర్ర‌, ఆవాలు, శ‌న‌గ ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు కొద్దిగా వేగిన త‌రువాత ప‌చ్చి మిర్చి, క‌రివేపాకు, ప‌సుపు, రుచికి త‌గినంత ఉప్పు వేసి క‌లిపి వేయించుకోవాలి. ఉల్లిపాయ‌లు పూర్తిగా వేగిన త‌రువాత ట‌మాట ముక్క‌ల‌ను వేసి ట‌మాట ముక్క‌లు పూర్తిగా మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా శ‌న‌గ పిండి వేసి క‌లిపిన నీటిని పోసి క‌లిపి ఉడికించుకోవాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి క‌లపాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బొంబాయి చ‌ట్నీ త‌యార‌వుతుంది. దీనిని ఇడ్దీ, పూరీ, దోశ, చపాతీల్లో తింటే బాగుంటుంది.

Exit mobile version