Site icon Prime9

Mushroom: పుట్టగొడుగులు శాఖాహారమా, మాంసాహారమా..? వెజిటేరియన్స్ ఎందుకు తినరు..?

are mushrooms vegetarian or non vegetarian

are mushrooms vegetarian or non vegetarian

Mushroom: పుట్టగొడుగులను కొందరు మాంసాహారమని మరికొందరు శాఖాహారమని అంటున్నారు. అయితే ఇది వెజ్ ఆర్ నాన్ వెజ్ అనే దాని మీద పలువురు పలు రకాలుగా చెప్తున్నారు. పుట్టగొడుగుల కూర చూడగానే నోరూరినవారంతా కచ్చితంగా మాంసాహారులే అయ్యుంటారు. అదేంటి పుట్టగొడుగులు తింటే మాంసాహారులు అంటున్నారు అనుకుంటున్నారా. ఎందుకంటే శాకాహారులెవ్వరూ ఈ కూర తినేందుకు ఇష్టపడరు. దాన్ని వందశాతం మాంసాహారంగానే భావిస్తారట. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు ఎలాగైతే మాంసాహారంగా పరిగణిస్తారో అలానే పుట్టగొడుగులు నాన్ వెజ్ అని పూర్తి శాకాహారుల అభిప్రాయం. కానీ చాలా అధ్యయనాలు పుట్టగొడుగులను శాకాహారంగా పరిగణించాయి. అంతెందుకు ఫైవ్ స్టార్ రెస్టారెంట్లలో కూడా పుట్టగొడుగులను శాకహార మెనూలో భాగంగానే డిస్ ప్లే చేస్తారు.

పుట్టగొడుగులు వృక్షశాస్త్రం ప్రకారం మొక్క కాదు అలాగని జంతు జాతి కూడా కాదు. అవి శిలీంధ్రాల వర్గానికి చెందినవని చెప్తారు శాస్త్రవేత్తలు. దీనికి ఆకులు, వేర్లు, గింజలు ఏవీ ఉండవు. పెరగడానికి కాంతి కూడా అవసరం లేదు. సేంద్రియ పదార్థాలను తిని ఇది పెరుగుతుంది. అందుకే పుట్టగొడుగులను కూరగాయగా పరిగణించరు. ఇదిలా ఉంటే శిలీంధ్రాలు కూడా సూక్ష్మజీవులే అని చాలా మంది శాకాహారుల నమ్మకం. ఇక శిలీంధ్ర వర్గానికి చెందిన పుట్టగొడుగులు కూడా మాంసాహారం కిందకే వస్తుంది కదా అని వారి వాదన. ఇదీ ఒక విధంగా నిజమే అనిపిస్తుంది. అయితే పుట్టగొడుగుల పుట్టుకకు శిలీంధ్రాలు కారణం అయినా పెరిగాక మాత్రం గొడుగు ఆకారంలో ఉండే మొక్కలాగే ఉంటుందని, దానికి జీవం కూడా ఉండదు కాబట్టి మాంసాహారం కాదని మరికొంతమంది అభిప్రాయం.

2005లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ప్రొటిస్టాలజిస్ట్స్ అందరూ కలిసి “ది జర్నల్ ఆఫ్ యూకారియోటిక్ మైక్రోబయాలజీ”లో ఓ కథనాన్ని రాశారు. అందులో జంతువు, శిలీంధ్రాలను కలిపిన ఒక వర్గం ఉందని చెప్పారు. ఈ వర్గాన్ని ఓపిస్తోకోన్ట్స్ (Opisthokonts)  అని పిలుస్తారని ఈ సమూహానికే పుట్టగొడుగులు చెందుతాయని వారు వెల్లడించారు. వీటికి సెల్యులార్ నిర్మాణం, జన్యువులు రెండింటితోనూ సంబంధం ఉంటుందని చెప్పారు. అంటే వీరు చెప్పిన ప్రకారం పుట్టగొడుగుల పూర్తిస్థాయిలో కూరగాయల వర్గానికి రావు. అందుకే పుట్టగొడుగులను శాకాహారంగా భావించరు. అమెరికా వ్యవసాయ శాఖ మాత్రం పుట్టగొడుగులను కూరగాయగానే గుర్తించింది. దానికి కారణం అది అందించే పోషకాలే.

ఇదీ చదవండి: పుదీనాతో ఆందోళన మాయం..!

Exit mobile version