Site icon Prime9

Yatra 2 : యాత్ర 2 టీజర్‌ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Yatra 2

Yatra 2

 Yatra 2 : 2019 ఎన్నికలకు ముందు వైఎస్‌ఆర్‌ బయోపిక్‌గా యాత్ర చిత్రం విడుదలయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ చిత్రం ఫిబ్రవరి 8, 2024న థియేటర్లలోకి రానుంది.

యాత్ర రిలీజ్ తేదీ నాడే..( Yatra 2 )

ఈ రోజు యాత్ర 2 టీజర్‌ను జనవరి 5న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.యాత్ర 2’ని మహి వి రాఘవ్ దర్శకత్వం వహించారు . త్రీ ఆటమ్ లీవ్స్, వి సెల్యులాయిడ్ మరియు శివ మేక సంయుక్తంగా నిర్మించారు. వైఎస్ఆర్ మరణానికి ముందు, తర్వాత జగన్ ఎలా సీఎం అయ్యారనే అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి భాగంలో వైఎస్‌ఆర్‌గా నటించిన మమ్ముట్టి ఈ పార్ట్‌లో కూడా అదే పాత్ర పోషిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ‘యాత్ర’ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదల కాగా, ఇప్పుడు ‘యాత్ర 2’ కూడా అదే తేదీన విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.యాత్ర 2 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయోపిక్. ఆయన రాజకీయ ప్రయాణం, 2019 ఎన్నికల్లో విజయం ఎలా ఉంటుందనేది సినిమాలో చూపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం , మధి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.

Exit mobile version