Toxic First Glimpse Release: కన్నడ రాక్‌స్టార్ యష్ బర్త్‌డే సర్‌ప్రైజ్ వచ్చింది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ (Toxic Movie). కేజీయఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తున్న చిత్రమిది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి తాజాగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ రోజు (నవంబర్ 8) యశ్ బర్త్‌డే సందర్భంగా టాక్సిక్ నుంచి అభిమానుల కోసం అదిరిపోయే అప్‌డేట్ వదిలారు.
నేషనల్ అవార్డు గ్రహిత గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కే నారాయణ, యష్‌లు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో దాదాపు అంతా స్టార్ తారగణమే నటిస్తుంది. అయితే ఎంతో కాలంగా టాక్సీక్ నుంచి ఓ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి మూవీ టీం ట్రీట్ ఫీస్ట్ ఇచ్చింది. గ్లింప్స్ పేరుతో స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. దాదాపు ఒక నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో యష్ స్టైల్, మ్యానరిజం చూస్తుంటే కేజీయఫ్ చిత్రాన్ని తలపిస్తుంది. టక్సెడ్, ఫశ్రీడోరా డ్రెస్‌లో కారు చూస్తుంటే యష్ వింటేజ్ యశ్‌లా కనిపించాడు.
రెట్రో పబ్‌లో స్టైలిష్‌గా సిగరేట్ కాలుస్తూ యష్ లుక్, ఆ వీడియో గ్లింప్స్ చివరలో పబ్‌లో అమ్మాయితో చేసిన డ్యాన్స్ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్‌కి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ గ్లింప్స్ చూసి యష్ బర్త్‌డే ట్రీట్ అదిరిపోయిందంటున్నారు. ఇది కదా ఫ్యాన్స్ కోరుకుందంటూ రాకిభాయ్ లుక్, మ్యానరిజంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం టాక్సిక్ గ్లింప్స్ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాయి. ప్రస్తుతం టాక్సిక్ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
రిలీజ్ ఎప్పుడంటే..
అయితే టాక్సిక్ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. కానీ కొత్త రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు టాక్సిక్ నుంచి వరుస అప్‌డేట్స్ ఇచ్చేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తుంది. ఇదిలా ఉంటే టాక్సిక్ బాలీవుడ్ బేబో, స్టార్ నటి కరీనా కపూర్ కీలక పాత్ర పోషించనుందని సమాచారం. ఇందులో ఆమె యష్‌కు అక్క పాత్రలో కనిపించనుందని ఇన్‌సైడ్ సినీ సర్కిల్లో టాక్. ఇక ఇందులో హీరోయిన్ పాత్ర కోసం గతంలో శ్రుతి హాసన్ , సాయిపల్లవిల పేర్లు వినిపంచాయి. తాజాగా కియారా అద్వాని పేరు తేరపైకి వచ్చింది. మరి ఇందులో హీరోయిన్ ఎవరనేరది క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సింది.