Site icon Prime9

Vishwak Sen: విశ్వక్‌ సేన్‌ లైలా ట్రైలర్‌ రిలీజ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది

Laila Movie Trailer Release Update: మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ ఫలితాలతో సంబంధం లేకుండ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నాడు. గతేడాది గామీ, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, మెకానిక్‌ రాకీ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. అందులో గామీ తప్పా మిగతా రెండు సినిమాలు ఆశించిన విజయం అందుకోలేకపోయాయి. ఇప్పుడు లైలా అంటూ డిఫరెంట్‌ కాన్పెప్ట్‌తో వస్తున్నాడు. రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

షైన్‌ స్క్రీన్‌ పిక్చర్స్‌, ఎస్‌ఎమ్‌టీ అర్చన ప్రజెంట్స్‌ బ్యానర్స్‌పై లైలాను రూపొందిస్తుంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. సోను మోడల్‌, లైలాగా రెండు విభిన్న పాత్రలతో అలరించబోతున్నాడు. ఇటీవల రిలీజైన టీజర్‌లో విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌లో కనిపించి సర్‌ప్రైజ్‌ చేశాడు. దీంతో మూవీపై మరింత బజ్‌ పెరిగింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతోంది మూవీ టీం.

ఈ మేరకు ట్రైలర్‌పై తాజాగా విశ్వక్‌ సేన్ అప్‌డేట్‌ ఇచ్చాడు. “సోనూ మోడల్‌, లైలా మిమ్మల్ని అలరించేందుకు రాబోతున్నాడు. ఫిబ్రవరి 6న ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించబోతున్నాం” అంటూ ప్రకటన ఇచ్చాడు. ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన కొత్త పోస్టర్ మూవీపై మరింత ఆసక్తి పెంచుతుంది. ఇందులో విశ్వక్‌ సేన్‌ సోనూ మోడల్‌గా, లైలాగా కనిపించాడు. మేకప్‌ చైర్‌లో లైలా (విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌) కూర్చోని ఉండగా.. వెనకలా సోనూ మోడల్‌ మేకప్‌ చేస్తూ కనిపించాడు. ఇందులో విశ్వక్‌ లేడీ గెటప్‌ ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. అచ్చం అమ్మాయిలాగే ఉన్నావంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Exit mobile version