Laila Movie Alert on Piracy: లైలా మూవీ రేపు రిలీజ్ అనగా తాజాగా ఆడియన్స్‌కి ఓ అలర్ట్ ఇచ్చింది. పైరసీని ప్రోత్సహించోద్దని, తమ సినిమా ఎక్కడైన పైరసీ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపింది. కాగా ఈ మధ్య పైరసీ రాయుళ్లు మళ్లీ చెలరేగిపోతున్నారు. పైరసీని అరికట్టడమనేది సినీ పరిశ్రమ సవాలుగా మారింది. దీనిపై ఎన్నిచర్యలు తీసుకున్నా దీనికి అడ్డుకట్ట పడటం లేదు.
ఫిలిం ఛాంబర్ వల్ల మొన్నటి వరకు పైరసీ రాయుళ్లు సైలెంట్ అయ్యారు. కానీ గేమ్ ఛేంజర్ నుంచి మరోసారి తమ వాటం చూపిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు ముందే కొన్ని సీన్స్ లీక్ చేశారు, రిలీజైన రోజే ఆన్‌లైన్లో హెచ్‌డీ ప్రింట్ లీక్ చేశారు. రీసెంట్ తండేల్ మూవీ సైతం విడిచిపెట్టలేదు. ఈ సినిమా ఏకంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రదర్శించారు. మూవీ రిలీజైన రెండో రోజే ఏపీలో కొన్ని ఏరియాల్లో లోకల్ ఛానళ్లో ఈ సినిమా ప్రదర్శించారు. దీనిపై నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసులు చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కూడా వారు తగ్గడం లేదు.
#Laila is a film made for big screen experience and big screen entertainment. Watch #Laila only in theatres 🤩
SAY NO TO PIRACY 🚫
Report the piracy links to @blockxtechs on their social handles or email them to report@blockxtech.com.Book your tickets now!
🎟… pic.twitter.com/kcjpbEvyue— Shine Screens (@Shine_Screens) February 13, 2025
ప్రెస్‌మీట్ పెట్టిమరి కేసు నమోదు చేస్తామని హెచ్చిరించని మరుసటి రోజే మరోసారి ఆర్టీసీ బస్సులో తండేల్‌ను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో పైరసీపై లైలా టీం అలర్ట్ అయ్యింది. పైరసీని ప్రోత్సహించొద్దంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ఎక్కడైనా ‘లైలా’ పైరసీ కనిపిస్తే @blockxtechs సోషల్ మీడియాలో హ్యాండిల్స్ ద్వారా గాని, report@blockxtech.com మెయిల్ ద్వారా గానీ సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ మేరకు పైరసీ కట్టడిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. లైలా మూవీ బిగ్‌స్క్రీన్‌పై చూసి ఆనందించదగ్గ సినిమా అని, థియేటర్‌లోనే చూఇస ఎంజాయ్ చేయాలని పేర్కొంది.