Site icon Prime9

Veera Dheera Soora Teaser: ఈ కేసు ఈరోజు మిస్ అయితే లైఫ్ టైమ్ మిస్సే.. అదిరిపోయిన విక్రమ్ కొత్త టీజర్

Veera Dheera Soora Teaser: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కు మంచి హిట్ పడి చాలాకాలం అయ్యింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ధృవ నక్షత్రం రిలీజ్ అయ్యి హిట్ అవుతుందేమో అనుకుంటే.. అది  ఇంకా వాయిదాల  మీదనే నడుస్తోంది. ఇక దాని గురించి పక్కన పెడితే.. ప్రస్తుతం విక్రమ్ నటిస్తున్న చిత్రం వీర ధీర శూర. SU అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హెచ్ ఆర్ పిక్చర్స్, రియా శిబు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుషార విజయన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

 

ఎవరైనా మొదటి పార్ట్ రిలీజ్ చేసి.. రెండో పార్ట్ రిలీజ్ చేస్తారు. కానీ, SU అరుణ్ కుమార్  మాత్రం వీర ధీర శూర పార్ట్ 2 ను మొదట రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా వీర ధీర శూర పార్ట్ 2 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.  టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.  టీజర్ లో కథను అంచనా వేయడం కష్టంగా ఉంది. విక్రమ్, దుషార విజయన్  భార్యాభర్తలుగా కనిపించారు. వీరికి ఒక పాప ఉన్నట్లు చూపించారు. 

 

ఇంకోపక్క పవర్ ఫుల్ పోలీస్ గా సూర్య కనిపించగా.. రౌడీగా సూరజ్ వెంజరమూడు కనిపించాడు. వీరికి విక్రమ్ కు మధ్య ఒక వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ కేసు అన్ని కేసులాంటిది కాదు. ఈరోజు మిస్ అయితే లైఫ్ టైమ్ మిస్సే అని ఎస్ జె సూర్య చెప్పిన డైలాగ్ తో.. విక్రమ్ పైనే కేసు నడుస్తోందని తెలుస్తోంది.  ఇంకోపక్క విక్రమ్.. తన జోలికి రావద్దని, వస్తే ఎవరిని వదలను అని చెప్పడం.. చివర్లో విక్రమ్ పంచె కట్టుకొని కారులో నుంచి దిగి బాంబ్ విసరడం హైలైట్ గా మారింది. అసలు విక్రమ్ కు సూర్యకు ఉన్న పగ ఏంటి.. ? ఎందుకు విక్రమ్ ను ఎస్ జె సూర్య చంపాలనుకుంటున్నాడు. అసలు ఎవరీ వీర ధీర శూర అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. 

 

విక్రమ్ అభిమానులు అందరూ వీర ధీర శూర మీదనే ఆశలు పెట్టుకున్నారు. తంగలాన్ తో విక్రమ్ నట విశ్వరూపం చూపించాడు కానీ అదేమీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఈ సినిమాలో విక్రమ్ లుక్ మాస్ లానే కనిపిస్తుంది.  కథ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో విక్రమ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Exit mobile version
Skip to toolbar