Site icon Prime9

Vijay Devarakonda: రష్మికలో మీ జీవిత భాగస్వామి లక్షణాలు ఉన్నాయా? – విజయ్‌ ఏమన్నాడంటే..!

Vijay Devarakonda Latest Comments on His Personal and professional Life: హీరో విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. మే 30న విడుదల కావాల్సిన ఈ సినిమా జూలైకి వాయిదా పడింది. ప్రస్తుతం విజయ్‌ కాస్తా బ్రేక్‌ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా లైగర్‌ ఫ్లాప్‌తో పాటు వృత్తి, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లైగర్‌ సినిమా తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చిందన్నాడు.

 

పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నంచగా.. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి పెద్దగా ఆలోచనలు లేవు అని, కానీ ఏదోక రోజు తప్పకుండ పెళ్లి చేసుకుంటానన్నాడు. అనంతరం రష్మిక గురించి మాట్లాడు.. రష్మిక చాలా మంచి మనసు ఉన్న అమ్మాయని, ఆమెతో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉందన్నాడు. ఆమె అందమైన నటి అంటూ రష్మికపై ప్రశంసలు కురిపించాడు. అనంతరం జీవిత భాగస్వామి లక్షణాలు రష్మికలో ఉన్నాయా? విలేఖరి ప్రశ్నించగా.. మంచి మనసున్న అమ్మాయి ఎవరైనా ఫర్వాలేదంటూ ఆ ప్రశ్నను దాటవేశాడు.

 

ప్రస్తుతం విజయ్‌ కామెంట్స్‌ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. కాగా అనంతరం లైగర్‌, పూరీ జగన్నాథ్‌ గురించి చెప్పుకొచ్చాడు. “డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కలిసి వర్క్‌ చేయాలనేది నా కల. ఆయనతో ఎప్పుటికైనా సినిమా చేయాలనుకునేవాడిని. అది లైగర్తో నేరవేరింది. అయితే కథ విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కాకాపోతే ఈ సినిమాతో అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయాం.

 

మా కాంబో హిట్‌ రాలేదన్న బాధ ఇప్పటికీ ఉంది. కానీ, ఈ సినిమా నాకేన్నో పాఠాలు నేర్పించింది. లైగర్‌ నన్నేంతో మార్చింది” అని పేర్కొన్నాడు. అనంతరం డైరెక్టర్లలో నాగ్‌ అశ్విన్‌, సందీప్‌ రెడ్డి వంగా, తరుణ్‌ భాస్కర్‌లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో నేను నటించాను. ఆయన నన్ను తన లక్కీ స్టార్‌గా అనుకుంటారు. నాకు తొలి విజయాన్ని ఇచ్చింది కూడా నాగ్‌ అశ్వినే అని చెప్పుకొచ్చాడు.

Exit mobile version
Skip to toolbar