Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక పెద్ద హిట్ కోసం కష్టపడుతున్నాడు. లైగర్ సినిమా విజయ్ కెరీర్ మొత్తాన్ని నాశనం చేసింది అనే చెప్పాలి. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ నుంచి బయటపడడానికి విజయ్ చాలా కష్టపడుతున్నాడు. ఖుషీ, ది ఫ్యామిలీ స్టార్ లాంటి కుటుంబ కథాచిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలనుకున్నాడు. కానీ, అది జరగలేదు. ఈ రెండు సినిమాలు ఆశించినంత ఫలితాలను అందించలేకపోయాయి.
ఇక ఈసారి ఎలాగైనా సరే భారీ హిట్ కొట్టాలని విజయ్ పెద్ద ప్లాన్ వేసి.. స్టార్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం కింగ్ డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను పెంచేసింది.
మళ్లీ రావా, జెర్సీ లాంటి క్లాస్ మూవీస్ తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి నుంచి కింగ్ డమ్ లాంటి ఒక వైలెంట్ ఫిల్మ్ ను ప్రేక్షకులు అస్సలు ఊహించలేదు. టీజర్ ను బట్టి సినిమా ఓ రేంజ్ లో హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక కింగ్ డమ్ కాకుండా విజయ్ మరో సినిమాను పట్టాలెక్కించాడు. రాజావారు రాణివారు సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన డైరెక్టర్ రవికిరణ్ కోలా. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న రవికిరణ్ ఆ తరువాత అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు రైటర్ గా పనిచేశాడు.
Gautham Vasudev Menon: అలాంటి సినిమాలు ఏ హీరో చేయడం లేదు.. డైరెక్టర్లను బండబూతులు తిడుతున్నారు
ఇక ఇప్పుడు రవికిరణ్ కోలా.. విజయ్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విజయ్ – దిల్ రాజు కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి. ది ఫ్యామిలీ స్టార్ కూడా వీరి కాంబోలో వచ్చిందే. ఇక ఇప్పుడు మరోసారి వీరు హిట్ కొట్టడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో దిల్ రాజు.. విజయ్ – రవికిరణ్ కోలా సినిమా టైటిల్ ను ఫ్లోలో చెప్పేశాడు.
విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న సినిమా టైటిల్ రౌడీ జనార్దన్ అని చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి విజయ్ యాటిట్యూడ్ చూసి అందరూ రౌడీ అని బిరుదు ఇచ్చేసారు. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరో కూడా రౌడీగా మారిపోయాడు. రాయలసీమ ఫ్యాక్షనిస్టు రౌడీ జనార్దన్ గా విజయ్ కనిపించనున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా 2026 లో రిలీజ్ కానున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చాడు. మరి రౌడీ హీరోగా విజయ్ ఓకే కానీ.. రాయలసీమ రౌడీ జనార్దన్ గా విజయ్ సెట్ అవుతాడా.. ? లేదా.. ? ఈ సారైనా విజయ్ మంచి హిట్ ను అందుకుంటాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.