Site icon Prime9

Venu Swamy: మహేష్ వల్లే కృష్ణ చనిపోయాడు.. వేణుస్వామి వీడియో వైరల్

Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినీ, రాజకీయ నాయకుల జీవితాల్లో ఏం జరుగుతుందో ముందే గ్రహించి  ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తూ ఉంటాడు. హీరోయిన్ల జతకల్లో దోషాలు ఉంటే.. శాంతి పూజలు చేయిస్తూ ఉంటాడు.

 

జనసేన ఓడిపోతుందని, జగన్ గెలుస్తాడని, అల్లు అర్జున్ జాతకం బావుందని, ప్రభాస్ కు పెళ్లి అవ్వదని, విజయ్ దేవరకొండ, సమంత చనిపోతారని.. ఇలా ఒకటి అని కాదు. వరుసగా ఏదో ఒక సెలబ్రిటీ గురించి చెప్పుకొస్తూనే ఉంటాడు. జనసేన గెలిచాకా .. పవన్ ఫ్యాన్స్.. వేణుస్వామిపై మండిపడటంతో ఇకనుంచి రాజకీయల గురించి నోరు ఎత్తనని చెప్పుకొచ్చాడు.

 

ఇప్పుడు మాత్రమే కాదు.. గతంలో వేణుస్వామి అన్న ప్రతి మాటను అభిమానులు బయటకు తీస్తున్నారు. తాజాగా మహేష్ బాబు ఫ్యాన్స్.. గతంలో వేణుస్వామి, మహేష్ గురించి చెప్పిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో మరోసారి వైరల్ చేస్తున్నారు. మహేష్ జాతకం వలనే  కృష్ణ మరణించాడని చెప్పుకొచ్చాడు.

 

“ఒకసారి విజయ్ నిర్మలగారు నన్ను అడిగారు. ఎలా ఉంది జాతకం ఆయనది అని. నాకు  కచ్చితంగా నిజం చెప్పడం అలవాటు కాబట్టి వెంటనే చెప్పేశాను. 2020 తరువాత ఇంట్లో మరణాలు కనిపిస్తున్నాయని చెప్పాను. అప్పుడు నరేష్.. నన్ను బయటకు పిలిచి.. అమ్మకు ఎందుకు చెప్పారు. ఆమె పానిక్ అవుతుంది కదా అని అన్నారు. 1995 నుంచి నేను కృష్ణ గారింట్లో పూజలు చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇలా చెప్పానో ఆ తరువాత నన్ను ఏ పూజకు పిలవలేదు.

 

మహేష్ బాబు జాతకంలో శని, గురు మారుతా ఉన్నాడు. దాని ఎఫెక్ట్ కూడా తల్లితండ్రి జాతకం  మీద పడింది. మహేష్ జాతకం వలనే కృష్ణ  చనిపోయాడని అనుకోవచ్చు” అని చెప్పుకొచ్చాడు. ఈ పాత వీడియోపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తండ్రి మరణం వలన మహేష్ ఎంత కృంగిపోయాడో అందరికీ తెలుసు. ఇప్పుడు కొంతమంది మహేష్  హేటర్స్.. ఈ వీడియోను వైరల్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ మాత్రం వేణుస్వామిపై పగబట్టారు. ప్రస్తుతం వేణుస్వామిపై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version
Skip to toolbar