Manchu Manoj : మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన మనోజ్, మౌనికల పెళ్లి ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరికి నెటిజన్స్, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
తాజాగా మనోజ్ పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది. దానికి కమెడియన్ వెన్నెల కిశోర్ వాయిస్ అందించగా.. మనోజ్, మౌనికలకు చెందిన అరుదైన ఫోటోస్ కనిపిస్తున్నాయి. “మూడు ముళ్ల బంధం, ఆరడుగుల అనుబంధం. సారీ.. ఏడడుగులు కదా.. కానీ మావాడు ఆరడుగులు.. సో సెంటిమెంటల్ గా ఉంటుందని.. బ్రేకింగ్ ది రూల్స్. పెళ్లి.. మ్యారేజ్.. M, M ఫ్రెండ్స్ కదా.. అలాగే ఉంటాయి మరి.. ” అంటూ స్టార్ట్ చేశాడు వెన్నెల కిశోర్. వయసుతో సంబంధం లేకుండా.. రేంజ్ చూడకుండా.. నచ్చితే నావోడు.. మెచ్చితే మనోడు. అదే ఎంఎం స్టైల్. ప్రపంచ మొత్తంలో ఏ మూలకు వెళ్లిన మనోడి ఫ్రెండ్స్ లేకుండా ఉంటారా.?
(Manchu Manoj) వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ – వెన్నెల కిషోర్
మనోడి డిగ్రీ సర్టిఫికెట్స్ ఎన్ని ఉన్నాయో తెలీదు కానీ.. స్కూల్ ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్ మాత్రం పది, పద్నాలుగు ఉంటాయి. ఇప్పటికీ అందరి స్నేహితులతో టచ్ లో ఉంటాయి. చదువు తక్కువ గ్రౌండ్ లో ఎక్కువ టైపు మనోడు అయితే.. మనోడికి ఆ దేవుడు ముడివేసిన ఆ అమ్మాయి ఎవరంటే.. డిగ్రీల మీద డిగ్రీలు.. ఫారిన్ లో మీద చదువుకొని వచ్చిన పక్కా సీమ బిడ్డా. ఆళ్లగడ్డ వాళ్ల అడ్డా.. భూమౌ మౌనికమ్మ. వీళ్లిద్దరిదీ బ్లాక్ బస్టర్. మంచు ఫ్యామిలీ ఫవర్ ఫుల్, ఇటు భూమా ఫ్యామిలీ ఫవర్ ఫుల్లే. వీళ్లిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. నేను నీకెల సాయపడగలను ?.. అని వాట్సాప్ స్టేటస్ కాకుండా ఏకంగా ప్రొఫైల్ పిక్ పెట్టుకున్నాడు. నమ్మితేనే చేయందిస్తాడు. అలాంటిది నమ్మి వస్తే గుండెల్లో పెట్టుకుంటాడు. దటీజ్ మనోజ్. ఏడడుగులు.. ఏడేడు జన్మల వరకు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ చెప్పుకొచ్చాడు వెన్నెల కిశోర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
గతంలో మనోజ్ .. ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా.. 2019లో పరస్పర అంగీకారంతో వీరు విడాకులు తీసుకున్నారు. మరోవైపు భూమా మౌనిక రెడ్డికి సైతం బెంగుళూరుకు చెందిన ఓ వ్యాపారవేత్తతో పెళ్లికాగా.. తక్కువ సమయంలోనే వీరు విడిపోయారు. కాగా ఈరోజు పెళ్లి తరువాత కర్నూల్ బయలుదేరారు. ఈ ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/