Site icon Prime9

Sankranthiki Vasthunam: బ్లాక్ బస్టర్ పొంగల్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ – ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? వెంకటేష్ కెరీర్ లో అరుదైన రికార్డు..

Sankranthiki Vastunam First Day Collections: విక్టరి వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి, వెంకటేష్ ది హిట్ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఈ కాంబో మూవీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్, కామెడీ లవర్ కి పండగే పండగ అనే అంచనాలు నెలకున్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది.

ఈ పొంగల్ కు పర్ఫెక్ట్ పండగలాంటి సినిమా అందించారంటూ మూవీ టీం ప్రశంసలు కురిపించారు. తొలిరోజు 90 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు కళకళలాడాయి. దీంతో తొలి రోజు సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్ల పంట కురిపించింది. ఫస్ట్ డే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 45 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి దుమ్మురేపింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో హయ్యేస్ట్ ఒపెనింగ్ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నా ఫస్ట్ డే కలెక్షన్స్ పై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది. ‘పండగకి వచ్చారు.. పండగని తెచ్చరాు’ మూవీ హిట్ పై ఆనందం వ్యక్తం చేసింది మూవీ టీం.

కాగా ఫస్ట్ షో నుంచి మూవీ పాజిటివ్ టాక్ అందుకుంది. ఫైనల్ మూవీ హిట్ ట్రాక్ లో పడటంతో మూవీ టీం సంబరాల్లో మునిగితేలింది. నిన్న సంక్రాంతికి వస్తున్నాం అంతా ఒక్కచోట చేరి కేక్ కట్ చేసి మూవీ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్స్ లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్ తో పాటు హీరోయిన్లు మినాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు పాల్గొన్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.

Exit mobile version