Site icon Prime9

Rana Naidu : ఫ్యామిలీతో వద్దు.. ఒంటరిగా చూడండి అంటున్న వెంకటేష్, రానా.. కారణం ఏంటంటే?

venkatesh and rana interesting comments on rana naidu web series

venkatesh and rana interesting comments on rana naidu web series

Rana Naidu :  దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్ – రానా లను ఒకే తెరపై చూడాలని అభిమానులు బాగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తప్పకుండా చేయాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలోనే వాళ్ళందరి కోరిక తీర్చడానికి వచ్చేస్తుంది.  ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లలో ఎప్పుడు లేని విధంగా వెంకటేష్ సైతం బొల్డ్ డైలాగ్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ని మాత్రం ఫ్యామిలీతో వద్దు.. ఒంటరిగా చూడాలని ఇద్దరూ హీరోలు కోరడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ టీమ్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

ఒంటరిగా చూడండి.. అలా అని భయపడాల్సిన పని లేదు – వెంకటేష్ (Rana Naidu)

ఈ సంధర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ .. “ఈ మధ్య కాలంలో వచ్చే వెబ్ సిరీస్ లను ఎవరికి వారే సెపరేట్ .. సెపరేట్ గానే చూస్తున్నారు. అలాంటి కంటెంట్ ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. మన జాగ్రత్తలో మనం ఉండటం బెటర్. అందరికీ తెలుసు ఈ మధ్య ఏమేం వస్తున్నాయో .. అందుకే ఎవరి ల్యాప్ టాప్ లో వారు చూస్తున్నారు. “రేపు ఈ వెబ్ సిరీస్ చూసినవారు నేనేదో అలా చేశాను .. ఇలా చేశాను అనేది ఒకటి ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ లో కనిపించే ప్రధానమైన పాత్రలు .. ఆ పాత్రల నేపథ్యం .. అవి అనుభవించే సంఘర్షణలు .. ఆ ఫ్రస్టేషన్ లో అలాంటి సీన్స్ కనిపిస్తాయి. అలా అని భయపడాల్సిన పనిలేదు .. మంచి ఎమోషన్స్ ఉంటాయి. అంతా ఎంజాయ్ చేసే విధంగానే ఉంటాయి” అని చెప్పుకొచ్చారు.

అలానే రానా మాట్లాడుతూ– ‘‘రానా నాయుడు’ లో రానా చీకటి జీవితం గడుపుతుంటాడు. కానీ తన కుటుంబాన్ని పోషించడానికి బాగా కష్టపడతాడు. నా పాత్రలో ఎక్కువ కోపం చూపించే సన్నివేశాలున్నాయి. నిజ జీవితంలో నేను ప్రశాంతంగా ఉంటాను. కానీ ఈ సిరీస్‌లో కోపం ప్రదర్శించడం సవాలుగా అనిపించింది. అదృష్టవశాత్తూ మా బాబాయ్‌కి(వెంకటేష్‌), నాకు ఆఫ్‌ స్క్రీన్‌ కూడా మంచి బాండింగ్‌ ఉండటంతో నటించడం సులభం అయింది. వైరం ఉన్న పాత్రలో మెప్పించడం ఒక సవాల్‌తో కూడుకున్నప్పటికీ రానా, నాగా(వెంకటేష్‌ క్యారెక్టర్‌) పాత్రలు, వాటి మధ్య ఉండే ఆవేశం, భావోద్వేగాల పైనే దృష్టిపెట్టాం’’ అన్నారు. ఇది సినిమాగా చెప్పలేని కథ .. అందువల్లనే వెబ్ సిరీస్ గా చేయవలసి వచ్చింది. వెబ్ సిరీస్ ల వలన ఆర్టిస్టులు ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నిజానికి ముంబైవారే ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వెబ్ సిరీస్ లకు సంబంధించి ఇక్కడ ఉన్నన్ని అవకాశాలు ఎక్కడా లేవు” అని చెప్పారు. ప్రస్తుతం వీరిద్దరూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version