Rana Naidu Season 2 Locks Streaming Date: ‘విక్టరీ’ వెంకటేష్, రానా దగ్గుబాటిలు ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇద్దరు దగ్గుబాటి వారసులు, పైగా బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ప్రకటనతోనే ఫుల్ బజ్ తెచ్చుకుంది. డాక్క్ కామెడీ వెబ్ సిరీస్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరిస్ విడుదల తర్వాత సెన్సేషన్ అయ్యింది. ఇది ఎంతటి విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈ వెబ్ సిరీస్ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారు.
ఇందులో అభ్యంతకరమై భాష, వల్గారిటీ ఎక్కువగా ఉందని కొందరి నుంచి విమర్శలు కూడా వచ్చాయి. కానీ నార్త్‌లో మాత్రం ఈ వెబ్ సిరీస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన రానా నాయడు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ పార్ట్ భారీ విజయం సాధించడంతో దీనికి సీక్వెల్‌ను కూడా తీసుకువస్తోన్న సంగతి తెలిసిందే. రానా నాయుడు 2గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తి చేసుకుని స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తాజాగా విడుదల తేదీని ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. జూన్ 13 నుంచి రానా నాయుడు 2 వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
తాజాగా ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ మేరకు రానా నాయుడు 2కి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసింది. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించి టీజర్ విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా రానా నాయుడు వెబ్ సిరీస్ రూపొందింది. ఇందులో వెంకటేష్ నాగా నాయుడు అనే తండ్రి పాత్ర పోషించగా.. రానా.. రానా నాయుడు కొడుకు పాత్రలో కనిపించాడు. ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ని సుందర్ ఆరోన్, లోకోమోటివ్ గ్లోబల్‌లు సంయుక్తంగా నిర్మించాయి.
Jab baat parivaar ki ho, Rana harr line cross karega ❤️🔥
Watch Rana Naidu Season 2, out 13 June, only on Netflix. #RanaNaiduOnNetflix pic.twitter.com/NwhRM3MQcE— Netflix India (@NetflixIndia) May 20, 2025