Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు కానుకగా అభిమానులకు ఓ స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో రెండు సినిమాల్లో నటిస్తుండగా వాటిలో ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు.
కాగా #Vt12 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
రొటీన్ లవ్ స్టోరీ, చందమామ కథలు, గుంటూర్ టాకీస్, పిఎస్‌వి గరుడ వేగ చిత్రాలతో తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రవీణ్ సత్తారు.
ఇక ముఖ్యంగా చందమామ కథలు చిత్రం జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.
ప్రవీణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇప్పటికీ చిత్ర యూనిట్ ఎలాంటి అప్‌డేట్‌ను ఇవ్వలేదు.
అయితే తాజాగా ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకొని చిత్ర యూనిట్ సినిమా టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది.
దీంతో మెగా అభిమానులు అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
“గాండీవధారి అర్జున”గా వరుణ్ తేజ్..
ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది.
ఈ మేరకు సోషల్ మేయ వేదికగా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
లండన్ బ్రిడ్జ్‌పై యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా నచ్చేస్తుంది.
ఇక గాండీవధారి అర్జున అనే టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది.
Keeping peace is a bloody business!🔥#GandeevadhariArjuna@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/HQQxaZ65oV
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2023
మహాభారతంలో అర్జునుడి పేరును టైటిల్‌గా ఖరారు చేయడం ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పొచ్చు.
ఇందులో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు.
అయితే ఈ సినిమాలో మొదటిసారిగా వరుణ్ తేజ్ గూడచారి పాత్రలో కనిపించనున్నట్లు మొదటి నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ బట్టి ఆ వార్తలు నిజమే అనిపిస్తుంది.
ఇక ఈ సినిమాలో వినయ్ రాయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు.
ఈ సినిమాను ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ చేస్తున్నారు.
ఇప్పటికే లండన్ షెడ్యూల్‌ను 80 శాతం పూర్తి చేశారు. మిగతా 20 శాతం కూడా యూరప్‌లోని ఇతర దేశాల్లో ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు గూడచారి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను నమోదు చేసుకున్న నేపథ్యంలో గాండీవధారి అర్జునపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.
మరోవైపు ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ వరుణ్ తేజ్ అభిమానులు అందరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయనకు పుట్టిన రోజు విషెస్ చెబుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/