Site icon Prime9

Varalaxmi Sarathkumar: పెళ్లి తర్వాత నా భర్త లైఫ్‌ మారిపోయింది – అసలు పెళ్లి చేసుకోవద్దనుకున్నా, కానీ..!

Varalaxmi Sarathkumar About Marriage Life: వరలక్ష్మి శరత్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడు శరత్‌ కుమార్‌ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదట హీరోయిన్‌గా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించింది. అయితే 12 ఏళ్ల క్రితం ఆమె హీరోయిన్‌గా విశాల్‌ హీరోగా తెరకెక్కిన ‘మదమగ రాజ’ సినిమా విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో ఇవాళ (జనవరి 31) విడుదలైంది.

ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న వరలక్ష్మి తన మ్యారేజ్ లైఫ్‌ గురించి చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త నికోలయ్‌ సచ్‌దేవ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత తన లైఫ్‌ ఏం మారలేదని, కానీ తన భర్త జీవితంలో మార్పులు వచ్చాయని చెప్పింది. తన కోసం తన భర్త పేరు కూడా మార్చుకున్నారని తెలిపింది. సాధారణంగా పెళ్లి తర్వాత అమ్మాయిల లైఫ్‌స్టైల్లో మార్పులు రావడం, పేరు మారడం వంటివి జరుగుతాయి. కానీ పెళ్లి తర్వాత వరలక్ష్మి భర్త పేరు మారిందని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ తన భర్త నికోలయ్‌ గురించి చెప్పిందో ఇక్కడ చూడండి.

“పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు ఏం రాలేదు. పెళ్లికి ముందు నా లైప్‌ ఎలా ఉందో, పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంది. కానీ నా భర్త నికోలయ్‌ లైఫ్‌లో మాత్రం ఎన్నో మార్పులు వచ్చాయి. నా కోసం ఆయన ముంబై నుంచి హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతున్నారు. తన పేరును నికోలయ్‌ సచ్‌దేవ్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌గా మార్చుకున్నారు. నా కెరీర్‌ విషయంలో నాకంటే ఎక్కువగా ఆయనే ఫోకస్‌గా ఉన్నారు. ఇంకా నేను చాలా సాధించాలని ఆయన ఆశిస్తున్నారు. వర్క్ విషయంలో నాలో స్ఫూర్తి నింపుతున్నారు.

‘నువ్వు సాధించేది ఇంకా చాలా ఉంది. అది తొందరలోనే వస్తుంంది’ అని అంటారు” అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి గురించి తానేప్పుడు ఆలోచించలేదన్నారు. “అసలు నేను పెళ్లి చేసుకుంటానని కూడా అనుకోలేదు. నేనేప్పుడు పెళ్లి గురించి ఆలోచించలేదు. నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉండేది కాదు. వివాహం నాకు సెట్‌ అవ్వదనే అభిప్రాయంతో ఉండేదాన్ని. కానీ నికోలయ్‌ పరిచయం తర్వాత నా అభిప్రాయం మారింది. తనతో పరిచయం తర్వాత అతడే నా జీవిత భాగస్వామి అని అర్థమైంది. ఆ విధంగా పెద్దల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాం” అని చెప్పారు.

Exit mobile version