Upasana Baby Shower: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రలు కాబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో చిరంజీవి స్వయంగా ఈ శుభవార్తను అందరితో పంచుకున్నాడు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లైన పదేళ్ల తర్వాత పెద్ద గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ముఖ్యంగా చిరంజీవి అయితే తన వారుసుడు/ వారుసరాలు కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు.మార్చి 27 న పుట్టిన రోజు తర్వాత రాంచరణ్, ఉపాసన తో కలిసి దుబాయ్ వెళ్లారు. ఈ నేపథ్యంలో ఉపాసనకు ఆమె పుట్టింటివాళ్లు దుబాయ్ లో సీమంతం నిర్వహించారు. ఉపాసన సిస్టర్స్ అనుష్పాల, సింధూరిలు ఈ బేబీ షవర్ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకలో ఉపాసన-రాంచరణ్ దంపుతులు బాగా ఎంజాయ్ చేశారు.
నేనెంతో కృతజ్ఞురాలిని..(Upasana Baby Shower)
బీచ్ ఒడ్డున రాంచరణ్, ఉపాసన దంపతులు ఫొటోలకు ఫోజులిచ్చారు. వైట్ అండ్ వైట్ డ్రస్సుల్లో దంపతులిద్దరూ మెరిసిపోయారు. భార్య ఉపాసన ను హగ్ చేసుకున్న రాంచరణ్.. ఆమెను ముద్దాడుతున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. కాగా.. సీమంతానికి సంబంధించిన వీడియోను ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ మీ ప్రేమకు నేనెంతో కృతజ్ఞురాలిని.. బెస్ట్ బేబీ షవర్ ను ఏర్పాటు చేసిన నా సిస్టర్స్ థ్యాంక్యూ ’ అంటూ ఆమె పేర్కొన్నారు. ఉపాసన బేబీ షవర్ ఫొటోలు నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.
పదేళ్లుగా అనుమానాలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో ఉపాసన తన ప్రెగ్నీన్సీ గురించి మాట్లాడారు. సమాజం కోరుకున్నప్పుడు కాకుండా తనకు తల్లిని కావాలనుకున్నపుడు మాతృత్వం రావడం ఆనందంగా ఉందని తెలిపింది. పెళ్లైన పదేళ్ల తర్వాత పిల్లలను కనాలని తాను , చరణ్ అనుకున్నట్టు తెలిపారు. తమ తమ ప్రొఫెషన్స్ లో బాగా స్థిరపడిన తర్వాతే పిల్లల గురించి ఆలోచించాలనుకున్నామన్నారు. కానీ సమాజం, బంధువులు, తెలిసిన వాళ్లు చాలామంది ఈ పదేళ్ల నుంచి నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూనే ఉన్నారని తన ఎదుర్కొన్న వాటిని చెప్పుకొచ్చింది.