Unni Mukundan: కేరళ హైకోర్టు మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు బిగ్ షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలని ఉన్ని ముకుందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఫిబ్రవరి 2023 లో విధించిన స్టేను కేరళ హైకోర్టు తాజాగా ఎత్తివేసింది. ఈ కేసులో ఫిర్యాదుదారుతో సెటిల్‌మెంట్ కుదిరిందని ఊహగానాలు కూడా వచ్చాయి.
అసలు జరిగిన విషయం ఏంటంటే.. 2017 ఆగస్టు 23 సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు సెప్టెంబరు 15, 2017లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ తీవ్రంగా ఖండించారు. అంతే కాకుండా ఆమెపై పరువు నష్టం కేసును కూడా దాఖలు చేశారు. సెటిల్‌మెంట్‌లో ఆమె రూ. 25 లక్షలు డిమాండ్ చేసిందని ముకుందన్ ఆరోపించాడు. తర్వాత ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్స్ వేశారు. అయితే ఆయనకు కోర్టుల్లో ఫలితం అనుకూలంగా రాలేదు. దీంతో ఉన్ని ముకుందన్ తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది.
ఉన్ని ముకుందన్ చివరిసారిగా ‘మలికాపురం చిత్రంలో కనిపించారు. 2011 లో ‘సీడన్’ అనే తమిళ సినిమాతో ముకుందన్ తెరంగేట్రం చేశారు. అతను మలయాళం, తమిళం, తెలుగు సినిమాలలో నటించారు. తెలుగులో భాగమతి లో అనుష్క శెట్టి తో కలిసి నటించాడు. ముకుందన్ ఫిల్మ్స్‌ని ప్రొడక్షన్ బ్యానర్ ను కూడా నడుపుతున్నాడు.