Bro Movie: మామ- మేనల్లుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ కలిసి నటిస్తున్న సినిమా “బ్రో”. ఈ మూవీ తమిళంలో సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తంకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ మూవీ కూడా సముద్రఖని దర్శత్వంలో తెరకెక్కనుంది. మామా అల్లుడు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఒరిజినల్ లో లేకపోయినా కూడా(Bro Movie)
కాగా బ్రో సినిమా షూటింగ్ ఇప్పటికే పూరైందని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే జరుపుకుంటుంది మూవీ యూనిట్ తెలిపారు. ఇక ఈ మూవీని జులై 28న రిలీజ్ చేస్తామని కూడా చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ టాక్ టాలీవుడ్ టైన్లో విస్తృతంగా వినిపిస్తుంది. అదేంటంటే బ్రో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈ సాంగ్ కు ఆడిపాడేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఖాయమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ లో ఛాన్స్ దక్కించుకుంటుంది ఈ ముద్దగుమ్మ. దీనితో బ్రో సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ కి ఊర్వశి రౌతేలాను తీసుకున్నట్టు సమాచారం.
హైదరాబాద్ లోని ఓ పబ్ లో ఈ సాంగ్ షూట్ జరుగనుందని తెలుస్తుంది. అయితే ఈ పాటలో పవన్ ఉంటాడో, లేదో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్ తమిళ్ వినోదయ సితం మూవీలో మాత్రం ఎలాంటి స్పెషల్ సాంగ్ లేదు. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ వైరల్ గా మారాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.