Site icon Prime9

Union Minister Rajnathsingh: రెబల్ స్టార్ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేంద్ర మంత్రి

Defence-Minister-Rajnath-Singh-meets-prabhas

Hyderabad: రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాజనాధ్ సింగ్ పరామర్శించారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యంతో మరణించిన నటుడు, బిజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజు నివాసానికి కేంద్ర మంత్రి కొద్ది సేపటిక్రితం చేరుకొన్నారు.

కృష్ణంరాజు భార్య, పిల్లలతోపాటు నటుడు ప్రభాస్ ను ఓదార్చారు. మధ్యాహ్నం 3గంటలకు ఫిల్మ్ నగర్ లో జరగనున్న కృష్ణంరాజు సంస్మరణ సభలో కేంద్ర మంత్రి పాల్గొంటారు. అనంతరం రాజ్ నాధ్ సింగ్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజేపి నేత లక్ష్మణ్ లు రాజ్ నాధ్ వెంట ఉన్నారు.

Exit mobile version