Site icon Prime9

Indian 2: ఇండియన్ 2 సినిమా కొత్త పోస్టర్

Indian 2:యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ కెరీయర్లో బెస్ట్ మూవీస్‌లో ఇండియ‌న్ సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా విడుద‌లై ఇప్పటికి 21 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ సినిమా గుర్తులు, జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికి చేరిగిపోలేదు. అవి ఇప్పటికి కూడా త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు మ‌ళ్లీ క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఇండియ‌న్ సినిమాకు సీక్వెల్‌గా ఇండియ‌న్ 2 షూటింగ్ జరుగుతుంది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాలిసి ఉంది. కరోనా వల్ల ఈ సినిమా కొంచం పోస్టుపోన్ అయింది.

ఇండియ‌న్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి కావాల్సిన చ‌ర్చ‌లు ఎప్పుడో జరిగాయని తెలిసిన సమాచారం. ప్రస్తుతం శంకర్ గారు రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. RC 15ని సెట్స్ పైకి ఎప్పుడో తీసుకెళ్లిపోయారు. త‌మ సినిమాను పూర్తి చేయ‌కుండా మ‌రో సినిమా ఎలా చేస్తారంటూ అప్ప‌ట్లో ఇండియ‌న్ 2 నిర్మాత‌లు శంక‌ర్‌పై కేసు వేయ‌టానికి కూడా వెళ్ళారు. కానీ శంక‌ర్ మ‌ళ్లీ సినిమాను చేస్తానని మాట ఇచ్చాక వ్యవహారం చక్క పడిందని తెలిసిన సమాచారం. మ‌రో వైపు రామ్ చ‌ర‌ణ్‌తో చేస్తోన్న RC 15 సినిమా షూటింగ్ కొంచం బ్రేక్ పడింది. ఇక్క‌డ కూడా క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ రావ‌టంతోనే సినిమా షూటింగ్ ఆగిన‌ట్లు ఉందని సినీ వర్గాలు వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే టాక్ బ‌లంగానే వినిపిస్తోంది.

ఈ గ్యాప్‌లో శంక‌ర్ ఆగిపోయిన త‌న ఇండియ‌న్ 2 సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిపోయాడు. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్‌, ర‌కుల్ ప్రీత్ స‌హా ఇతర న‌టీన‌టులు సోష‌ల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

Exit mobile version