Puri Jagannadh: ఈడీ విచారణకు హాజరయిన పూరీ జగన్నాథ్, చార్మీ

లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌లను గురువారం ఈడీ అధికారులు విచారించారు.విచారణకు హాజరయ్యారు.

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 11:24 AM IST

Tollywood: ’లైగర్’ సినిమా పెట్టుబడులకు సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీ కౌర్‌లను గురువారం ఈడీ అధికారులు విచారించారు. విచారణకు హాజరయ్యారు. వీరిద్దరినీ 10 గంటలకు పైగా విచారించారు. లైగర్ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారు? నిధుల సమీకరణ, నిర్మాణ ఖర్చులు, వచ్చిన ఆదాయం, పంపకాలకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది.

లైగర్ సినిమాలో సీఎం కేసీఆర్ కుమార్తె కవిత పెట్టుబడులు పెట్టినట్లుగా సెప్టెంబర్ 6వ తేదీన కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెట్టుబడులు పెట్టారని, ఆమెకు చెందిన డబ్బు విదేశాల నుంచి లైగర్ నిర్మాతలకు అందిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థ మై హోం గ్రూప్ విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తోందని కూడా ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈడి ఇదే ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పూరీ, చార్మిలను విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.