Site icon Prime9

Pawan Kalyan: హరి హర వీర మల్లు సినిమా నుంచి కొత్త అప్డేట్

pawan kalyan 2 prime9news

pawan kalyan 2 prime9news

Tollywood: భీమ్లా నాయక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేయయబోతున్నారని మన అందరికీ తెలిసిన విషయమే. హరి హర వీర మల్లు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఐతే ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. పిరియాడిక్ యాక్షన్ హరిహర వీరమల్లు సినిమాకు దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ ప్రస్తుతం ఈ సినిమా సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ అనేక సార్లు వాయిదాలు పడి, మళ్ళీ ఇప్పుడు మొదలై సినిమా నుంచి అప్డేట్స్ బయటకు వస్తున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించగా ప్యాన్ ఇండియా సినిమాగా మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు సినిమాను 2023 ఏప్రిల్ 29న విడుదల చేస్తామని తెలిపారు.

పవన్ కళ్యాణ పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన పవర్ గ్లాన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాకి పాన్ ఇండియా రేంజులో మంచి టాక్ కూడా సంపాదించుకుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సారి మరో క్రేజీ ట్రీట్ కు సిద్ధమవుతుందని టాలివుడ్ వర్గాల వారు చెబుతున్నారు.ఈ ఏడాది చివర అనగా డిసెంబర్ 31న మేకర్స్ అందించనున్నారని తెలిసింది. మరి దీనిపై అధికారికంగా ఏ అప్డేట్ రాలేదు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి స్వరాలను అందించనున్నారు.

Exit mobile version