Site icon Prime9

Natu Natu Song: ఆస్కార్ వేదికపై నాటు నాటు సాంగ్ కి స్టెప్పులేసేది ఎవరో తెలిసిపోయిందోచ్..

naatu naatu song

naatu naatu song

Natu Natu Song: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించింది.  ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్‌ దేవ్‌గన్‌, శ్రియా శరణ్‌, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పటి వరకు పలు ఇంటర్నేషనల్ అవార్డ్స్ ని కైవసం చేసుకున్న ఈ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు పోటీ పడుతుంది. మార్చి 12న ఈ అవార్డుల వేడుక జరగనుంది. కాగా ఈ వేడుకలో నాటు నాటు సాంగ్ డాన్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని తెలిసిన దగ్గర నుంచి.. ఈ పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్ అండ్ చరణ్ ఇవ్వబోతున్నారా? అనే ఒక క్యూరియాసిటీ ప్రతి ఒక్క భారతీయుడిలో ఉంది.

అయితే అందరి అంచనాలను నిరాశ పరుస్తూ జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చాడు. ఇటీవల ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో నాటు నాటు సాంగ్ గురించి మాట్లాడుతూ.. ఆస్కార్ స్టేజి పై పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కచ్చితమైన ప్రాక్టీస్ అవసరం. కానీ మాకు రిహార్సల్స్ చేయడానికి సమయం కుదరలేదు అంటూ తెలిపాడు. తాము పర్ఫార్మ్ చేయడం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈ పర్ఫార్మెన్స్ ఎవరు ఇవ్వబోతున్నారంటూ మళ్ళీ సస్పెన్స్ నెలకుంది. తాజాగా దీని మీద క్లారిటీ వచ్చేసింది.

 

ఆస్కార్ స్టేజి పై నాటు నాటు సాంగ్(Natu Natu Song)

అమెరికన్ డాన్సర్ అయిన ‘లారెన్ గోట్లిబ్’ ఆస్కార్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతుందట. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అధికారికంగా తెలియజేసింది. ఈ మేరకు ఆ పోస్ట్ లో.. నేను ఆస్కార్ వేదిక పై నాటు నాటు సాంగ్(Natu Natu Song) ప్రదర్శన ఇస్తున్నాను. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అంటూ రాసుకొచ్చింది.

ప్రముఖ అమెరికన్ డాన్స్ షో ద్వారా పాపులర్ అయిన ఈ భామ.. ప్రభుదేవా నటించిన హిందీ మూవీ “ఏబీసీడీ” మూవీ ద్వారా ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బాలీవుడ్ లోని ప్రముఖ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా, జడ్జిగా చేసింది. ఇప్పుడు ఆస్కార్ వేదిక పై వరల్డ్స్ ఫేమస్ సాంగ్ ని పర్ఫార్మ్ చేసే అవకాశం దక్కించుకుంది. కాగా ఇదే స్టేజి పై కీరవాణితో పాటు పాట పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగుంజ్, కాలభైరవ కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే.

2022 మార్చి 24న రిలీజ్‌ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా యూఎస్, జపాన్‌, పలు దేశాలలోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. అలానే ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కైవసం చేసుకుంటుంది.

Exit mobile version