Site icon Prime9

Nandamuri Taraka Ratna: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తారకరత్నపెద్దకర్మ పత్రిక.. అన్నీ తామై అండగా వారిద్దరూ!

Nandamuri Taraka Ratna

Nandamuri Taraka Ratna

Nandamuri Taraka Ratna: నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున (ఫిబ్రవరి 18) తుదిశ్వాస విడిచారు. కాగా  నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయిన సంగతి తెలిసిందే. కుప్పంలో చికిత్స అనంతరం బెంగుళూరుకి తరలించారు. వైద్యులు ఎంతగానో శ్రమించినా ఫలితం లేకపోయింది. అయితే తారకరత్నకు నివాళులు, అంత్యక్రియలు వంటి ఈ కార్యక్రమాలన్నీ బాలకృష్ణ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా బాలకృష్ణ తారక రత్న కుటుంబానికి అన్నీ తానై అండగా నిలిచారు. అలానే తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి దగ్గరి బంధువు, వైసీపీ ఎంపీ అయిన విజయ సాయి రెడ్డి కూడా తోడుగా ఉన్నారు.

పార్టీలు వేరైనా కుటుంబం కోసం ఒక్కటై..

ఈ మేరకు బాలకృష్ణ, తారకరత్న మధ్య బాబాయ్-అబ్బాయిగా చాలా మంచి అనుబంధం ఉంది.  దీంతో తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పుడు కానీ, మరణించిన తర్వాత కానీ అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య బాబు. ఇక విజయసాయిరెడ్డి కూడా తారకరత్న(Nandamuri Taraka Ratna) నివాళులు, అంత్యక్రియలు కార్యక్రమాల్లో అక్కడే ఉండి బాలకృష్ణతో కలిసి పనిచేశారు. ఆ తర్వాత చినకర్మ సమయంలోనూ  ఇద్దరూ అక్కడే ఉండి పనులు జరిపించారు. తారకరత్న భార్యకు, ఆ కుటుంబానికి పక్కనే ఉండి వారిద్దరూ భరోసా కల్పిస్తున్నారు.

అన్నీ వారై తారకరత్న(Nandamuri Taraka Ratna) పెద్దకర్మ కూడా

వీరిద్దరూ రాజకీయాల పరంగా వేరే పార్టీలు అయినప్పటికీ.. తారకరత్న కోసం, వాళ్ళ కుటుంబం కోసం ఒక్కటై దగ్గరుండి పనులు జరిపించారు. దీంతో పార్టీల పరంగా ఎన్ని ఉన్నా, ఇలా కుటుంబం కోసం ఒక్కటై నిలబడటంతో అందరూ వీరిద్దర్నీ అభినందించారు. తాజాగా మరోసారి అంతా వీరిద్దర్నీ ప్రజలంతా అభినందిస్తున్నారు. ఎందుకంటే తారకరత్న పెదకర్మ కూడా వీరిద్దరే దగ్గరుండి చూసుకోబోతున్నారు అని సమాచారం అందుతుంది.

తాజాగా తారకరత్న పెదకర్మ తేది, స్థలం ప్రకటిస్తూ ఓ కార్డుని ముద్రించారు. ఈ కార్యక్రమానికి పిలిచేవారందరికి ఆ కార్డు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న పెదకర్మ ఆహ్వాన పత్రిక ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ కార్డుపై మార్చి 2న గురువారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో తారకరత్న పెదకర్మ నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు నందమూరి బాలకృష్ణ, విజయసాయిరెడ్డి పేర్లు కార్డులో ప్రచురించారు. అలాగే కార్డు మీద తారకరత్న సతీమణి అలేఖ్య, వారి పిల్లలు నిషిక, తనయ్ రామ్, రేయ పేర్లతో పాటు అలేఖ్యరెడ్డి ఫ్యామిలీ పేర్లని కూడా ప్రచురించారు. దీంతో మరోసారి అభిమానులు, నెటిజన్లు అంతా వీరిద్దర్నీ అభినందిస్తున్నారు.

 

Exit mobile version