Site icon Prime9

Akkineni Nagarjuna: 100వ చిత్రం పై తేల్చుకోలేకపోతున్న నాగార్జున

Nagarjuna

Nagarjuna

Tollywood: కింగ్ నాగార్జున అభిమానులు అతని 100వ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఘోస్ట్ ప్రమోషన్స్ సందర్భంగా, నాగ్ మాట్లాడుతూ నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నానని 100 వ చిత్రం త్వరలో ప్రకటించబడుతుందని తెలిపారు. అయితే వీరిలో గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజా నాగార్జున యొక్క 100వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి రేసులో ముందున్నట్లు సమాచారం.

అంతేకాదు అఖిల్ అక్కినేని ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని కూడ సమాచారం. అయితే ఈ సినిమా విషయంలో నాగ్ పూర్తిగా అయోమయంలో పడ్డాడని తెలుస్తోంది. నాగ్ 100వ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైతే ప్రేక్షకులు మరియు అతని అభిమానులు నిరాశ చెందుతారు. తాజాగా విడుదలయిన ఘోస్ట్ మూవీ ఫెయిల్యూర్ అభిమానులను నిరాశలో ముంచెత్తింది. అందువలన నాగార్జున 100 వ చిత్రం పై ఆచి తూచి ముందుకు వెళ్లే అవకాశముంది.

నాగార్జున తన తదుపరి చిత్రంలో మోహన్ రాజాతో కలిసి పనిచేయాలని డిసైడయ్యాడు. అయితే ఈ చిత్రం ప్రస్తుతానికి 100వ చిత్రమా కాదా అన్నది తెలియదు. త్వరలోనే నాగ్ సినిమాకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది.

Exit mobile version