Guntur Kaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో మహేష్ వింటేజ్ మాస్ గెటప్ లో అదిరిపోయాడనే చెప్పాలి. అయితే ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని చాలా కాలం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే ఇకపై ఆ బాధలేదులెండి. సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
ఏందీ బీడీ 3Dలో కనపడతుందా(Guntur Kaaram Movie)..
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ని ఈ సినిమాకి ఫిక్స్ చేసారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మూవీ మేకర్స్ ‘మాస్ స్ట్రైక్’ వీడియోని రిలీజ్ చేసారు. అతడు, ఖలేజా సినిమాల్లో మహేష్ బాబుని కొత్తగా ప్రెజెంట్ చేసినట్లే ‘గుంటూరు కారం’ మాస్ స్ట్రైక్ లో లుక్లో సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు త్రివిక్రమ్. ఇక ఈ ఒక నిమిషం నిడివిగల గ్లింప్స్ వీడియో విషయానికి వస్తే ఓ సూపర్ సాంగ్ తో మొదలైన మహేష్ మాస్ స్ట్రైక్ వీడియో, రజినీ స్టైల్ లో మహేష్ నోటిలో నుంచి తీయడంతో చూస్తున్న ఫ్యాన్స్ కాసేపు ఇది మన మహేష్ ఏనా అనిపించేంతలా పీక్స్ కి వెళ్లిపోయింది. ‘ఏందీ బీడీ 3Dలో కనపడతుందా” అని మహేష్ ఓ యాసలో అడిగిన విధానం మాత్రం ఫాన్స్ కి మాంచి కిక్ ఇస్తోంది.
లాంగ్ హెయిర్ తో, మంచి మిర్చి కలర్ రెడ్ చెక్స్ షర్ట్, హెడ్ బ్యాండ్ తో మహేష్ మామూలుగా లేడనుకోండి. గత పదేళ్లలో మహేష్ బెస్ట్ లుక్స్ లో ఇది ఒకటనే చెప్పాలి. ఇక ఈ మూవీకి కూడా థమన్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. కాగా ఈ మాస్ స్ట్రైక్ కి ఇచ్చిన బీజీతో ఈ మూవీకి థమన్ ప్రాణం పోసేసాడు. హారిక హాసిని క్రియేషన్స్ ముందు చెప్పినట్లుగానే మహేష్ మాస్ స్ట్రైక్ ని థియేటర్స్ కి విడుదల చేశారు. అయితే ఫ్యాన్స్ మాత్రం డిజిటల్ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు. ఈలోపే థియేటర్స్ నుంచి టైటిల్ అండ్ వీడియో లీక్ అయిపోవడం అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది. దీనితో చేసేదేమీలేక మూవీ మేకర్స్ వెంటనే ఆన్ లైన్ లో రిలీజ్ చేసేసారు.