Site icon Prime9

Ram Gopal Varma: కేసీఆర్ బయోపిక్ తీయ్యలని ఉంది.. ఆర్జీవి

kcr biopic plan by RGV

kcr biopic plan by RGV

Tollywood: యూత్‌ జనరేషన్‌ మారుతున్న కొద్దీ వాళ్ల అభిప్రాయాలు ఆలోచనలు మారుతుంటాయని అందుకే ఇప్పుడు రీ రిలీజ్‌ సినిమాలకు విశేషమైన స్పందన లభిస్తోందని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు. మరియు కేసీఆర్ బయోపిక్ తీయాలని ఉందంటూ ఆయన తెలిపారు.

రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో నట్టి కుమార్ నిర్మించిన చిత్రం అడవి. 2009లో ఈ సినిమా విడుదలయ్యింది. ఈ సినిమాలో నితిన్, ప్రియాంక కొఠారి జంటగా నటించారు. కాగా ఇప్పుడు ఈ చిత్రాన్ని ఈ నెల 14న రీ రిలీజ్‌ చేస్తున్నారు. తరం మారుతున్న ప్రతీసారి గతంలో వచ్చిన కొన్ని సినిమాలు చూడాలని యూత్‌ కోరుకుంటుంటారని ఆర్జీవీ తెలిపారు. గతంలో తాను తీసిన పలు హిట్‌ సినిమాలను ఆయా నిర్మాతలతో మాట్లాడి రీ రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు. అలాగా కేసీఆర్‌గారి బయోపిక్‌ చేసే ఆలోచన ఉందన్నారు.

అడవి సినిమాను దాదాపు వంద థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నామని నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. ఇకపోతే ప్రభాస్‌ ‘రెబల్‌’ను ఈ నెల 15న, 22న ‘వర్షం’ సినిమాను రీ రిలీజ్‌ చేయబోతున్నానని అన్నారు. వర్మ, నేను పాతికేళ్లుగా మంచి స్నేహితులమని కానీ కొద్దికాలం క్రితం మా మధ్య వచ్చిన అభిప్రాయభేదాలు ఇప్పుడు తొలగిపోయాయని, మా కాంబినేషన్‌లో మళ్లీ సినిమాలు చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి: చంద్రముఖిగా కాజల్.. ఫిలిం సిటీలో షూటింగ్

Exit mobile version