Site icon Prime9

DJ Tillu 2: అట్లుంటది మనతోటి.. డీజే టిల్లు 2లో హీరోయిన్ అనుపమ..!

dj tillu 2 heroine anupama

dj tillu 2 heroine anupama

DJ Tillu 2: యువ హీరో సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ ప్రధానపాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు సీక్వెల్ అయిన డీజే టిల్లు 2 షూటింగ్‌ ప్రారంభం అయ్యింది దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా నెట్టింట విడుదలైన విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్ తానే అన్నట్టుగా సిద్దు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ డీజే టిల్లు-2 చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్‌లో చేస్తుందని, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న‌ ఒక్క‌టే బాకీ అంటూ ఓ వార్త తెర‌పైకి వ‌చ్చింది. కాగా దీనిని నిజం చేస్తూ హీరో సిద్దు  తాజాగా నెట్టింట్లో ఓ ఫొటో షేర్ చేశాడు. ఈ పోస్ట్‌తో ఇప్పటివరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నేదానికి.. సిద్దు క్లారిటీ ఇచ్చేశాడ‌ని అర్థ‌మ‌వుతుంది. అట్లుంట‌ది మ‌న‌తోని అని (డీజే టిల్లు చిత్రంలోని పాపుల‌ర్‌ డైలాగ్‌)రాసి ఉన్న బ్లాక్ టీష‌ర్ట్ ను అనుప‌మ వేసుకుని సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్న స్టిల్‌ను షేర్ చేశాడు సిద్దు. టీ ష‌ర్ట్ బాగుంది అను అంటూ సిద్దూ ఫొటోకు క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు. దీనితో మొత్తానికి డీజే టిల్లు 2లో హీరోయిన్ అనుప‌మనే అని చెప్ప‌క‌నే చెప్పేశాడంటూ సిద్దూ సినీ లవర్స్ అంటుంటున్నారు. మరి దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. డీజే టిల్లు 2 సినిమాను పీడీవి ప్రసాద్ స‌మ‌ర్పిస్తుండ‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నారు.

ఇదీ చదవండి: సరోగసి వివాదం.. విఘ్నేశ్ ఆసక్తికర పోస్ట్

 

Exit mobile version