Site icon Prime9

Garikapati: గరికపాటి పై ఫైర్ అవుతున్న మెగా అభిమానులు

garika pati 1 prime9news

garika pati 1 prime9news

Hyderabad: భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు.

నిన్న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కు మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా హాజరయ్యరన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి గరికపాటిని కూడా ఆహ్వానించారు. ఐతే గరికపాటి మైక్ తీసుకుని మాట్లాడానికి ప్రయత్నించే సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి చాలామంది మహిళలు, యువతులు స్టేజి మీదకు ఎక్కారు. ఓకేసారి చాలా మంది స్టేజి ఎక్కడంతో దాంతో కొంత సేపు హడావిడి నెలకొంది. అక్కడకి వచ్చిన వారి ప్రతి ఒక్కరి దృష్టి చిరంజీవి పైనే ఉంది. గరికపాటి గారిని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకునే స్థితిలో కూడా లేరు. దీంతో ఆయన గురి అయి చిరంజీవి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీ ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండీ లేకపోతే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నాకు ఏ మొహమాటం కూడా లేదు. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారూ దయచేసి మీరు ఆ ఫోటోలు ఇవ్వడం ఆపేసి ఇటు వైపు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి ఇదే నా విజ్ఞప్తి, ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. లేదంటే నాకు సెలవు ఇప్పించండి ”నేను వెళ్లిపోతానంటూ” ఇలా గరికపాటి కొంచెం గట్టిగానే మైకులో చెప్పారు. ఆయన మాటల్లో కోపం, అసహనం, ఆగ్రహం కనిపించింది. కొంత సేపటికి అక్కదా ఉండే నిర్వాహకులు గరికపాటికి సర్ది చెప్పారు.

గరికపాటి పై నాగేంద్ర బాబు ఫైర్..
‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పై అసహనం వ్యక్తం చేసిన గరికపాటి నరసింహా రావు పై మెగా బ్రదర్ నాగబాబు సెటైర్ వేశారు. ట్విట్టర్ వేదికగా ఈ కౌంటర్ ఇచ్చారని మెగా అభిమానులందరు భావిస్తున్నారు. ”ఏ పాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే” అంటూ నాగబాబు చేసిన ట్వీట్ గరికపాటి గారిని ఉద్దేశించి చేసిందనే భావిస్తున్నారు.

Exit mobile version