Site icon Prime9

Sanchita Bashu: పవన్ కళ్యాణ్ వీరాభిమానికి సినిమా అవకాశం

tollywoos prime9news

tollywoos prime9news

Tollywood: సంచిత బషు మన అందరికీ పరిచయమున్న ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. ఒకప్పుడు సంచిత బషు టిక్ టాక్ వీడియోస్ తో పేరును, మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ఏకంగా సినిమా ఛాన్స్ కొట్టేసింది. రీసెంటుగా ఈమె ఓ మీడియా చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించింది. సినిమా అవకాశాల కోసం చాలా కష్టపడ్డానని,  జీవితంలో ఒక్కరైనా సినిమా నాకు అవకాశం ఇస్తారా అని బాధ పడని రోజు లేదని, ఎట్టకేలకు అనుదీప్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నా టిక్ టాక్ వీడియోలు అన్నింటిని డైరెక్టర్ అనుదీప్‌ చూశారని తరువాత ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’ సినిమాకి అవకాశం ఇచ్చారని ఇంటర్వ్యూలో వెల్లడించారు.

సంచిత ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తన చిన్న నాటి విషయాలను గుర్తు చేసుకొని ‘‘చిన్నతనం నుంచే నాకు యాక్టింగ్‌ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని పాత్రలో నేను నటించానని తెలిపింది. దర్శకులు వంశీ, లక్ష్మీనారాయణ నన్ను బాగా ప్రోత్సహించారు.

ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పూర్ణోదయ మూవీ క్రియేషన్స్‌, శ్రీజ ఎంటర్‌టైన్‌మెంట్‌, మిత్రవింద మూవీస్ బ్యానర్‌లపై సినిమా శ్రీజ, ఏడిద శ్రీరామ్ నిర్మాతలుగా వ్యవహరించారు. అనుదీప్ కెవి కథను అందించారు. ఈ సినిమాకు దర్శకత్వం వంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి దర్శకత్వం వహించారు. రధన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇంకా ఈ సినిమాలో శ్రీకాంత్‌ రెడ్డి,వెన్నెల కిశోర్,తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్‌ 2న మన ముందుకు రాబోతుంది.

Exit mobile version