Site icon Prime9

ETV Prabhakar Son: వెండితెర పైకి బుల్లితెర మెగాస్టార్‌ వారసుడు

prabhakar prime9news

prabhakar prime9news

Tollywood: బుల్లితెర మెగాస్టార్‌ ఈటీవీ ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్‌ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అతను నటిస్తున్న చిత్రాల నుంచి హ్యాపీబర్త్‌డే విషెస్‌తో కూడిన పోస్టర్‌లను చంద్రహాస్‌ తల్లి, ప్రభాకర్‌ భార్య మలయజ లాంచ్‌ చేశారు. వేదిక పై మీడియా సమక్షంలో చంద్రహాస్‌ కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఈటీవీ ప్రభాకర్‌ మాట్లాడుతూ నేను ఇండ్రస్టీకి వచ్చి 25 సంవత్సరాలు అయింది. శనివారం (17న) మా అబ్బాయి చంద్రహాస్‌ పుట్టినరోజు. తను కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటననే ప్రొఫెషన్‌గా తీసుకుని ముందుకు వెళుతున్నాడు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. తండ్రిగా వాడికి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక చేస్తున్నాను. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే. ఈ విషయంలో నా ఇన్‌వాల్వ్‌మెంట్‌ అస్సలు లేదు. రెండు చిత్రాలు ఆల్రెడీ షూటింగ్‌లు జరుపు కుంటున్నాయి. చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది వాళ్ల అమ్మ, నా భార్య మలయజని పేర్కొన్నారు.

చంద్రహాస్ మాట్లాడుతూ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షూటింగ్‌ల వాతావరణంలోనే పెరిగాను. అందుకే నాకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదు. పుట్టినప్పటి నుంచీ పరిశ్రమలోనే ఉన్నాను. ఇక మీదట కూడా ఇక్కడే ఉంటాను. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. మీడియా సహకారం లేనిదే ఏ ఆర్టిస్ట్‌కి, టెక్నీషియన్‌కి గుర్తింపు ఉండదు. అందుకే మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ముందుగా మిమ్మల్ని కలిసేందుకు ఈ చిన్న ప్రయత్నమని అన్నారు. చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉందంటూ ప్రభాకర్ భార్య మలయజ అన్నారు. తమ కుమారుడిని ఆశీర్వదించాలని కోరారు.

Exit mobile version