Site icon Prime9

Etlu movie: ప్రేక్షకుల ముందుకు రానున్న “Eట్లు” మీకు తెలుసా..

etlu meeku telusa movie trailer launch

etlu meeku telusa movie trailer launch

Tollywood News: శ్రీజ ఆర్ట్స్ అండ్ బాచిన వైష్ణవ్ చౌదరి ఫిల్మ్స్ పతాకాలపై అమీర్, ప్రణీత, దీపిక జంటగా సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం “Eట్లు”. పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు పూదరి రాజా గౌడ్, డా. ఎలిశాల లింగం, పూదరి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావులు నిర్మాతలుగా ఉన్నారు.

హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో “Eట్లు” ట్రైలర్, టీజర్ ను వైభవంగా లాంచ్ చేశారు. కాగా ఇటీవలె మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్దమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ లు చిత్ర టీజర్ ను విడుదల చేయగా, నటుడు కుప్పిలి శ్రీనివాస్, నిర్మాత తుమ్మల రామ సత్యనారాయణ, ఉప్పల మెట్టయ్య, పెంచల స్వామి లు చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇంకా ఈ ఈవెంట్లో ప్రతాప్ రెడ్డి, సీనియర్ నటుడు నారాయణ రావు, నటుడు అనిల్ బుజ్జిలతో పాటు చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ “Eట్లు” సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని, “Eట్లు” టీజర్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుమన్ తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటించారు.

ఇదీ చూడండి:  ఓటీటీలో కార్తికేయ-2… ఈ నెల 30 నుంచే..!

Exit mobile version